కొత్తూరు, మే 19: సరైన సాగుపద్ధతులతో అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొ.ఏవీ రామాంజనేయులు అన్నారు. కొత్తూరు మండలలోని పెంజర్లలో ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో కొత్తూరు మండలంలోని పెంజర్లలో సోమవారం రైతు ముంగిల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు నూతన వంగడాలు, మొక్కజొన్న, పత్తి, వరిలో ఆశించే చీడపీడల గురించి రైతులకు వివరించారు.
ప్రస్తుత కాలంలో సేద్యంతోపాటు సమగ్ర వ్యవసాయం చేయాలన్నారు. తద్వారా రైతులు ఆదాయం, సుస్థిరత పెరుగుతుందన్నారు. మట్టి పరీక్షలు ఎలా చేసుకోవాలి, పచ్చిరొట్ట ఎరువులు వాడటం, యూరియాను జాగ్రత్తగా వాడటం తదితర విషయాలను డా. పి రంజిత వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గోపాల్, పీహెచ్డీ విద్యార్థులు కావ్య, శ్రీను, ఏఈవో దీపిక, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.