గురుకులాల్లో ప్రవేశాలు
తెలంగాణ రాష్ట్ర సర్కార్ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ఎక్కువ పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేసింది.
- ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
- మార్చి 6వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలి
- ఏప్రిల్ 23న రాత పరీక్ష
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 26 గురుకులాలు
మొయినాబాద్, ఫిబ్రవరి 12 : తెలంగాణ రాష్ట్ర సర్కార్ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ఎక్కువ పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ప్రాధాన్యత అత్యంత ఘననీయంగా పెరిగింది. గురుకులాల్లో ప్రవేశం పొందాలి అంటే మంచి నైపుణ్యం ఉన్న విద్యార్థులు మాత్రమే సీటు పొందే పరిస్థితి ఉంది. గురుకుల విద్యా సంస్థల విద్యార్థులకు పారదర్శంగా సీట్లు కేటాయిస్తుంది. గురుకులాల్లో సీటు పొందలనుకునే విద్యార్థుల కోసం గురుకుల విద్యా సంస్థ ప్రత్యేకంగా వెబ్సైట్ ఏర్పాటు చేసింది. ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు గురుకుల విద్యా సంస్థ రూపొందించిన వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిన ఉంటుంది.
విద్యార్థులు దరఖాస్తు చేసుకున్చ తరువాత రాత పరీక్ష నిర్వహించి వారి ఫలితాలను ఆన్లైన్లో పొందుపర్చుతారు. మెరిట్ ఆధారంగా మాత్రమే సీటు పొందడానికి వీలుంటుంది. గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశం కోసం రాష్ట్ర సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఐదో తరగతిలో ప్రవేశాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఆన్లైన్ ఈ నెల 9వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానించడానికి అవకాశం కల్పించారు. ఏప్రిల్ 23న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం బాల, బాలికల పాఠశాలలు 26 ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో 80 సీట్లు చొప్పున 2080 సీట్లు ఉంటాయి.
ఉమ్మడి రంగారెడ్డిలో 26 పాఠశాలలు..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 26 తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాల, బాలికల పాఠశాలలు ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డిలో వికారాబాద్, మేడ్చల్ సైతం ఉండేవి. కానీ కొత్త జిల్లాలుగా ఆ రెండు వేరు అయ్యాయి. ఆ మూడు జిల్లాలు కూడా ఉమ్మడి రంగారెడ్డి కిందకు వస్తాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చిలుకూరు, ఇబ్రహీంపట్నం, పరిగి, శివారెడ్డిపేట, కొడంగల్, పెద్దేముల్, పెద్దమంగళారం(కోడింగ్ పాఠశాల), శంషాబాద్, కందుకూరు, మహేశ్వరం, ఉప్పల్, శామీర్‌పేట, కొందుర్గులో బాలుర పాఠశాలలు ఉన్నాయి. సరూర్‌నగర్, నంచర్ల, కోకట్, కొత్తగడి, చేవెళ్ల, నల్లకంచ, బంట్వారం, మోమిన్‌పేట, నార్సింగి, గౌలిదొడ్డి, పెద్దమంగళారం (కోడింగ్ పాఠశాల), మేడ్చల్, శంకర్‌పల్లిలో బాలికల పాఠశాలలు ఉన్నాయి.
ఒక్కో పాఠశాలలో 80 సీట్లు
ఒక్కో పాఠశాలలో 80 సీట్లు కేటాయించగా … మొత్తం 2080 మంది విద్యార్థులు ప్రవేశం పొందనున్నారు. అన్ని పాఠశాలల్లో ఆంగ్ల భాషలో విద్యాబోధన ఉంటుంది. ఒక్కో గురుకులంలో ఎస్సీకి 61 సీట్లు, ఎస్టీకి 5, బీసీకి 10, మైనార్టీకి 3, ఓసీకి 1 సీట్ల చొప్పున సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందే ప్రతి విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.1.20 లక్షలు పెట్టుబడి పెడుతుంది. ఒక్క సారి 5 తరగతిలో ప్రవేశం పొందితే 10వ తరగతి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై రూ.7.20 లక్షలు విద్యకు పెట్టుబడి పెడుతుంది. గురుకులాల్లో 5వ తరగతిలో సీటు పొందే విద్యార్థి ప్రస్తుత విద్యా సంవత్సరం 4వ తరగతి చదివి ఉండాలి.
పాత జిల్లాను ఒక యూనిట్‌గా..
గురుకులాలల్లో చేరేందుకు 2022-23 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే 5వ తరగతిలో ప్రవేశం పొందడానికి ఏర్పాటు చేసే పరీక్షకు అర్హులు. పాత జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని ఎంపిక చేస్తారు. ఆసక్తి విద్యార్థులు మార్చి 6వ తేదీలోపు రూ.100లు చెల్లించి వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలి. వెబ్సైట్http://tswreis.ac.in,(OR)http://tgtwgurukulam.telangana.gov.in,(OR)http://tgcet.cgg.gov.in,(OR)h
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

