Kadtal | కడ్తాల్ : లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయంలో జ్ఞానప్రసూనాంబ ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామం, అమ్మవారికి ఒడిబియ్యం కుంకుమార్చన, సహస్ర పారాయణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం పూజలో పాల్గొన్న మహిళలను మాజీ సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి శాలువాలతో సన్మానించి, కుంకుమార్చన భరణిలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఆంజనేయులు, మాజీ సర్పంచ్ లక్ష్మీ నరసింహ రెడ్డి, మాజీ ఉప సర్పంచులు రామకృష్ణ, జంగారెడ్డి, గ్రామ పెద్దలు సాయిరెడ్డి, రాములుయాదవ్, బ్రహ్మచారి, అశోక్ రెడ్డి, పాండునేత ఆలయ అర్చకులు తిరునగిరి శ్రీధర్ పంతులు పాల్గొన్నారు.