Rangareddy | షాబాద్, జూన్ 20 : జీవాలకు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలని రేగడిదోస్వాడ పశువైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని రేగడిదోస్వాడ గ్రామంలో గొర్రెలకు, మేకలకు చిటుక వ్యాధి నివారణ టీకాలు వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవాలకు వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గొర్రెలు, మేకలు పోషించుకుని జీవనం సాగించే రైతులకు మంచి ఆదాయం ఉంటుందని చెప్పారు. జీవాలు ఆనారోగ్యానికి గురైన వెంటనే తమకు సమాచారం అందించాలని తెలిపారు. అన్ని గ్రామాల్లో జీవాలకు వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యసిబ్బంది శ్రీనివాస్, గోపి, విద్యాసాగర్, రైతులు తదితరులున్నారు.