వికారాబాద్, సెప్టెంబర్ 15 : చిన్నారులకు ప్రీప్రై మరీ బోధనను అంగన్వాడీల్లోనే కొనసాగించా లని..తమ సమస్యలను పరిష్కరించాలని సోమవా రం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు కొడంగల్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సుమారు 300 మంది వరకు ముట్టడికి బయలుదేరగా..అందులో 50 మందివరకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు సీఎం నివాసం వద్దకు రావడంతో పోలీసులు వారిని అడ్డుకుని ఠాణాకు తరలించేందుకు యత్నించారు.
మిగతా వారు కొడంగల్ బస్టాండ్ ఎదుట నిరసన తెలపగా, అడ్డుకొని, ఈడ్చివేసి స్టేషన్‌కు తరలించే సమయంలో స్వల్ప తోపులాట జరిగింది. ఇందు లో లక్ష్మి, జ్యోతిలు సీఎం నివాసం వద్దే సొమ్మసిల్లి పడిపోయారు. మహిళా కానిస్టేబుళ్లు వారిని పోలీస్ వాహనంలో ఎక్కించగా.. తామే స్టేషన్‌ను వెళ్తామని చెప్పిన అంగన్వాడీలు బస్టాండ్ ఎదుట బైఠా యించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి, ముఖ్య మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగి వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.
పోలీసులు అక్కడికి చేరుకుని వారిని వాహనాల్లో స్టేషన్‌కు తరలించా రు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు మద్దతుగా వచ్చిన సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య, రామకృష్ణ, అంగన్వాడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు నర్సమ్మ, మరి కొందరిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. కాగా, అక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా పరిగి డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొడంగల్ సీఐ శ్రీధర్‌రెడ్డి, ఎస్ఐలు, సిబ్బంది చర్యలు తీసుకున్నారు.