ఆయమ్మనే.. అంగన్వాడీ టీచర్
చిన్నారుల కు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు చదువు చెప్పేది అంగన్వాడీ కేంద్రాలు. కానీ, ఆ సెంటర్లకు ఉపాధ్యాయులు కరువయ్యారు. మండ లంలోని కొత్త ఆగిర్యాలలో రెండు అంగన్వాడీ కేంద్రాలున్నాయి.
- రెండు సెంటర్లకు ఆమెనే దిక్కు
- టీచర్లు ఉద్యోగ విరమణ పొందినా కొత్త వారి నియామకం నిల్
- అధికారులకు పట్టని విద్యార్థుల అవస్థలు
కొందుర్గు , ఆగస్టు 21 : చిన్నారుల కు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు చదువు చెప్పేది అంగన్వాడీ కేంద్రాలు. కానీ, ఆ సెంటర్లకు ఉపాధ్యాయులు కరువయ్యారు. మండ లంలోని కొత్త ఆగిర్యాలలో రెండు అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈ రెండిటిలోని టీచర్లు రిటైర్ కావడం తో విద్యార్థులు అవస్థలు పడుతు న్నారు. దీంతో ఉన్న ఆయమ్మనే రెండు అంగన్వాడీ సెంటర్లకు దిక్కయింది. ఆమేనే విద్యార్థులకు బోధి స్తున్నది. మరోవైపు ప్రతినెలా వెంకిర్యాల, చిన్నఎల్కిచర్లకు చెందిన అం గన్వాడీ టీచర్లు వచ్చి బాలింతలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేసి వెళ్లిపోతున్నారు.
ఆయమ్మనే ఓ వైపు వంటావార్పు, మరోవైపు చిన్నారులకు చదువు చెబుతున్నది. రెండు సెంటర్లలో కలిపి 25 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. ఉపాధ్యాయులు రిటైర్ అయి ఏండ్లు గడుస్తున్నా వారి స్థానంలో టీచర్లను నియమించాల్సిన ఉన్నతాధికారులు ఇటువైపు చూడకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నేనే చదువు చెబుతున్నా ..
అంగన్వాడీ టీచర్లు రిటైర్ కావడం తో వారి స్థానంలో ఏండ్లు గడుస్తు న్నా ఎవరూ రాలేదు. దీంతో నేనే చిన్నారులకు చదువు చెబుతున్నా. ఉపాధ్యాయులు లేకపోవడంతో అంగన్వాడీ సెంటర్లకు పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు. చిన్నారులు చదువుకు దూరం కావద్దనే ఉద్దేశంతో ప్రతిరో జూ నేనే చదువు చెబుతున్నా. అధికారులు స్పందించి కొత్త టీచర్ల ను నియమించాలి.
-కేతమ్మ, అంగన్వాడీ ఆయా
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

