పనులు సకాలంలో పూర్తవుతాయి. చేపట్టిన వ్యాపారం నిరాటంకంగా సాగుతుంది. ఆదాయం పెరుగుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. పెట్టుబడులకు ప్రతిఫలాలు పొందుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు అనుకూల సమయం. భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. సాయిబాబా ఆలయాన్ని సందర్శించండి.
సహోద్యోగులతో, అధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. నలుగురిలో గుర్తింపు పొందుతారు. మంచి పేరు సంపాదిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా కార్య నిర్వహణపై మనసు నిలుపుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. శివారాధన శుభప్రదం.
విద్యార్థులు చదువులో రాణిస్తారు. మంచి సంస్థలలో చేరుతారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. నిర్మాణ కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అనవసరమైన ఖర్చులు ముందుకు రావచ్చు. వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. ఉద్యోగం స్థిరంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. అధికారులతో ఉత్సాహంగా ఉంటూ పనులు చేస్తారు. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. డబ్బు చేతికి రావడంలో ఇబ్బందులున్నాయి. చెల్లింపుల విషయంలో ఒత్తిడి పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం తీసుకుంటారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూల సమయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.
పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్యాల్లో అందరి సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. సంతృప్తిగా ఉంటారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. నలుగురికి సాయం చేస్తారు. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. అధికారుల ఆదరణ ఉంటుంది. సూర్యారాధన శుభప్రదం.
వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వృత్తిపరంగా సంతృప్తిగా ఉంటారు. ఊహించని ఖర్చుల మూలంగా పనులలో జాప్యం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలపై మనసు నిలుపుతారు. కళాకారులకు, సాహితీవేత్తలకు మంచి అవకాశాలు వస్తాయి. ఆస్తుల విషయంలో తగాదాలు కొనసాగుతాయి. అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.
పిల్లలు చదువులో రాణిస్తారు. పైచదువులకు అనుకూలం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. స్నేహితులతో పనులు నెరవేరుతాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. రైతులకు రాబడి పెరుగుతుంది. శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం క్రమేణా పెరుగుతుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. విద్యార్థులకు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రుల రాకతో సంతృప్తిగా ఉంటారు. పనులు నెరవేరుతాయి. పనుల్లో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతారు. రామాలయాన్ని సందర్శించండి.
ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఆత్మీయుల సహకారంతో పనులు నెరవేరుతాయి. భూముల కొనుగోలు విషయంలో వివాదాలు తలెత్తుతాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబ పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఊహించని ఖర్చులు ముందుకు రావొచ్చు. సహోద్యోగులతో చిన్నపాటి మనస్ఫర్థలు రావొచ్చు. గోమాత సేవ చేసుకోండి.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఆదాయం పెరుగుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. భూలావాదేవీల్లో ఏమరుపాటు తగదు. నరసింహస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ప్రారంభించిన పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. ఇంటి వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. సహోద్యోగులు, అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. సంయమనంతో పనులు చేసుకోవడం అవసరం. కళాకారులకు ఆదాయం కలిసి వస్తుంది. శివారాధన శుభప్రదం.
ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. శుభకార్యాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. బంధుమిత్రుల రాకతో సంతృప్తిగా ఉంటారు. సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి.
–గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in