మొయినాబాద్, ఏప్రిల్ 26 : అంబేద్కర్ గొప్ప దార్శనికుడని.. భారత రాజ్యాంగ వాస్తు శిల్పి అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని ఎతుబార్పల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని బుధవారం మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నంతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం సర్పంచ్ గుండాల నవనీత అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. అంబేద్కర్ కేవలం మాల మాదిగలకే మేలు చేయలేదని.. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి మేలు చేశారని.. అది ప్రతిఒక్కరూ తెలుసుకోవాలన్నారు. నేడు అందరూ స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే.. అది అంబేద్కర్ రాజ్యాంగమని పేర్కొన్నారు. నాటి సమాజంలో వంటింటికే పరిమితమై.. విద్యకు దూరంగా ఉండి బానిస జీవితం గడిపిన మహిళలు నేడు స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే మహిళలకు ప్రత్యేక హక్కులు కల్పించడమేనని తెలిపారు. మహిళకు ప్రత్యేక హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ తన మంత్రి పదవిని త్యాగం చేశారని పేర్కొన్నారు.
అంబేద్కర్ కడుపు కట్టుకుని, నిద్ర లేని రాత్రులు గడిపి గొప్ప చదువులు చదివి ఆయన భారత దేశానికి గొప్ప రాజ్యాంగం అందించారని తెలిపారు. కుల వివక్షతో బహుజన బిడ్డలు బానిస బతుకులు బతుకున్న నేపథ్యంలో అంబేద్కర్ కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేశారని చెప్పారు. భావితరాలకు అంబేద్కర్ జీవిత చరిత్రను అందించడంతోపాటు చదవాలని సూచించారు. కార్యక్రమలలో ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్, సర్పంచ్ నవనీతరాజు, ఆల్ ఇండియా అంబేద్కర్ రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడు రాజు, సర్పంచ్ స్వప్న, ఎంపీటీసీ రాంరెడ్డి, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు మహేశ్, ఉపాధ్యక్షుడు గిరి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మీడియా కార్యదర్శి నరేందర్, సహాయ కార్యదర్శి నరేందర్, కోశాధికారి విజయ్, బీఆర్ఎస్ నాయకులు జయవంత్, రాజు, నీలకంఠం, పద్మారెడ్డి, గణేశ్రెడ్డి, వెంకట్రెడ్డి, అంజయ్య, సీనియర్ నాయకులు దర్శన్, మాణెయ్య, సత్యనారాయణ, తిరుపతిరెడ్డి, మహేందర్, జనార్దన్ ఉన్నారు.