ఆమనగల్లు : ప్రతీ ఒక్కరూ భక్తిభావాలను అలవర్చుకోవాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం మాడ్గుల మండలంలోని దొడ్లపహాడ్ గ్రామంలో బొడ్రాయి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవాల నిర్వాహకులు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి శాలువా, పూలమాలతో సత్కరించారు.