వ్యవసాయ యూనివర్సిటీ : ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో వందల ఎకరాలు స్థలం నిరుపయోగంగా ఉంది. వాటిలో అధికంగా పిచ్చి మొక్కలు, ఎలాంటి ఉపయోగం లేని మొక్కలు అధికంగా ఉన్నాయని వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిచ్చి మొక్కలను తొలగించి దాదాపు 150 ఎకరాలలో నాణ్యత గల మొక్కలను పెంచేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు.
హెచ్ఎండీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లగా అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో పిచ్చి మొక్కలను తొలగించి విలువైన మొక్కలను పెంచేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పండ్ల మొక్కలు తదితర 300 మొక్కలను నాటేందుకు సిద్ధంగా ఉంచామని వీసి పేర్కొన్నారు.