చేవెళ్ల రూరల్, జూన్ 20 : విద్యార్థులు శుభ్రత పాటించి రోగాలు దరిచేరకుండా జాగ్రత్తలు పాటించాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. చేవెళ్ల మండల పరిధి ఊరెళ్ల గ్రామ రెవెన్యూలోని సాగర్ ఇంజినీరింగ్ కళాశాలలోని మహాత్మాగాంధీ జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాల, కళాశాల(బురాన్‌పూర్)లో జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా అల్బెండజోల్ మాత్రలు వేసే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరై విద్యార్థినులకు నులిపురుగుల నివారణ మాత్రలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. దేశంలో ఆరోగ్య సంస్కరణలతో చిన్న పిల్లల మరణాలు తగ్గాయని, విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో భారతదేశం అభివృద్ధిలో రెండో స్థానంలో ఉన్నదని, రానున్న 10 సంవత్సరాల్లో నం.1గా అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పరిసరాల పరిశుభ్రతతోపాటు విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత పాటించాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల డివిజన్లో 95,246 మంది 12 నెలల నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలకు నులి పురుగుల నివారణ మాత్రలు వేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. విద్యార్థుల్లో బుద్ధి మాంద్యం, అరుగుదల లేకపోవడం తదితర సమస్యలను నివారించడానికి ఈ మాత్రలు ఉపయోగపడుతాయని తెలిపారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, ఎంపీపీ విజయలక్ష్మి, డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో దామోదర్‌రావు, కళాశాల ప్రిన్సిపాల్ అనిత, వైస్ ఎంపీపీ ప్రసాద్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకట్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అనంత్‌రెడ్డి, దేవునిఎర్రవల్లి మాజీ సర్పంచ్ మాణిక్యరెడ్డి, నాయకులు శర్వలింగం, శ్రీనివాస్, కృష్ణ, డాక్టర్ వైభవ్‌రెడ్డి, శ్రీశైలం, నాగరాజు, కరుణాకర్, శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్ రఘుబాబు, ఆర్బీఎస్కే అధికారి డా.నెక్టార్, సీహెచ్‌వోలు గోపాల్‌రెడ్డి, సంతోష, వైస్ ప్రిన్సిపాల్ రాజసులోచన, డిప్యూటీ వార్డెన్ సల్మా, హెల్త్ సూపర్వైజర్ సిరి తదితరులున్నారు.
నులిపురుగులను నివారించాలి
తుర్కయాంజాల్ : నులిపురుగులను నివారిస్తేనే చిన్నారుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వో వినోద్, తుర్కయాంజాల్ మున్సిపల్ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినం కార్యక్రమంలో భాగంగా గురువారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి తొర్రూరులోని ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు నులిపురుగుల నివారణ మందును అందజేశారు. చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలంటే నులి పురుగులను నియంత్రించాలని వినోద్ సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ శివలింగంగౌడ్, అబ్దుల్లాపూర్‌మెట్ మండల వైద్యాధికారి శ్రావణ్‌కుమార్‌రెడ్డి, సీహెచ్‌వో గోపాల్‌రెడ్డి, హెచ్‌వో లక్ష్మీనారాయణ, హెల్త్ సూపర్వైజర్ నర్సింహ, ఏఎన్ఎం పద్మ, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
కొత్తూరు : కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని జడ్పీహెచ్ఎస్లో మండల వైద్యాధికారి డా.హరికిషన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జాతీయ నులిపురుగుల నిర్మూలన దింలో ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి పాల్గొని చిన్నారులకు అల్బెండజోల్ మాత్రలు వేశారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. తన మొదటి అధికారిక కార్యక్రమం కొత్తూరులో జరగడం ఆనందంగా ఉందన్నారు. అది కూడా విద్యార్థులకు ఆరోగ్యానికి సంబంధించి కావడం గర్వకారణంగా ఉందన్నారు.
జడ్పీటీసీ శ్రీలత మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యంపట్ల వారి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏడాది విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రను సగం.. రెండేండ్ల నుంచి 19 ఏండ్ల విద్యార్థులకు ఒక మాత్ర వేయాలన్నారు. శుక్రవారం యోగా దినోత్సవం ఉందని.. ఆ కార్యక్రమంలో కూడా విద్యార్థులు పాల్గొనాలన్నారు. అందుకోసం ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలన్నారు. దీనివల్ల చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు.
కొత్తూరు మండలంలోని పెంజర్లలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినంలో ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, జడ్పీటీసీ శ్రీలత పాల్గొని విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు వేశారు. అనంతరం ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా నులిపురుగుల నిర్మూలన మాత్రలు వేయించాలన్నారు. ఎస్బీపల్లిలో జరిగిన కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీలత పాల్గొన్నారు. కొడిచెర్లలో జరిగిన కార్యక్రమంలో ఎంపీటీసీ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బాలాజీ, హెచ్ఎం అంగూర్‌నాయక్, కౌన్సిలర్ శ్రీనివాసులు, ఎంపీటీసీ రాజేందర్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు దేవేందర్‌యాదవ్, యాదయ్య ఉన్నారు.