ఆర్టీఏ కార్యాలయాల్లో బ్రోకర్లదే హవా
జిల్లాలోని వికారాబాద్, పరిగి రవాణా శాఖ కార్యాలయాల్లో ఏజెంట్లదే హవా నడుస్తున్నది. ఆర్టీఏ కార్యాలయాల్లో లైసెన్సులు, రిజిస్ట్రేషన్ల నిమిత్తం వచ్చే వారి కంటే ఏజెంట్లే ఎక్కువగా ఉంటున్నారు.
- లైసెన్సులు, రిజిస్ట్రేషన్లకు వెళ్లే వాహనాదారుల నుంచి ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఏజెంట్లు
- పట్టించుకోని అధికారులు
వికారాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని వికారాబాద్, పరిగి రవాణా శాఖ కార్యాలయాల్లో ఏజెంట్లదే హవా నడుస్తున్నది. ఆర్టీఏ కార్యాలయాల్లో లైసెన్సులు, రిజిస్ట్రేషన్ల నిమిత్తం వచ్చే వారి కంటే ఏజెంట్లే ఎక్కువగా ఉంటున్నారు. వారిని కాదని ఎవరైనా లైసెన్స్, రిజిస్ట్రేషన్లకు వెళ్తే ముప్పుతిప్పలు పెడుతున్నారని పలువురు వాహనదా రులు పేర్కొంటున్నారు. బ్రోకర్లు ప్రతి పనికి ఒక రేట్‌ను ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తూ.. వచ్చిన డబ్బులో ఆర్టీఏ అధికారులకు కొంత ముట్టజెప్పుతున్నారన్నా ఆరోపణలున్నాయి. ఆర్టీఏ కార్యాలయాలకు నేరుగా వెళ్లే వారికి ఏదో సాకు చెప్పి వారి ఫైల్‌ను పెండింగ్‌లో పెడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. అదే ఏజెంట్ల ద్వారా లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్లకు
వెళ్తే ధ్రువీకరణ పత్రాలు లేకున్నా పనులు జరుగుతున్నట్టు సమాచారం. ఆన్లైన్లో టూ వీలర్ లెర్నింగ్ లైసెన్స్ కోసం రూ.300, టూ వీలర్‌తో కలిపి ఫోర్‌వీలర్ అయితే రూ. 450 చెల్లించాల్సి ఉంటుంది.
నెల నుంచి ఆరు నెలల్లోపు పర్మినెంట్ లైసెన్స్ కోసం టూ వీలర్ అయితే 1,035, టూ వీలర్‌తో కలిపి ఫోర్‌వీలర్ అయితే రూ. 1,350 చెల్లించాలి. ఆన్లైన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకొని ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్తే ఆధార్, ధ్రువీకరణ పత్రాలు లేవంటూ ఏదో కొర్రీ పెట్టి ఆ అప్లికేషన్‌ను వెనక్కి పంపిస్తున్నారు. అదే అదునుగా భావిస్తున్న ఏజెంట్లు అందిన కాడి కి దోచుకుంటున్నారు. లెర్నింగ్ లైసెన్స్‌కు రూ. 1,500-రూ.2వేలు, పర్మినెంట్ లైసెన్స్ కు రూ.3000-రూ. 4వేల వరకు వసూలు చేస్తున్నారు. ఒకవేళ లెర్నింగ్ టెస్టులో ఫెయిలైనా బ్రోకర్లను సంప్రదిస్తే క్షణాల్లో పనిని పూర్తి చేస్తున్నారు. కాకపోతే ఎలాంటి టెస్ట్‌లు లేకుండా లెర్నింగ్ లైసెన్స్ కావాలంటే దానికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. బ్రోకర్లు ఆర్టీఏ అధికారులకు మామూళ్లు ఇస్తుండడంతోనే చూసీచూడనట్లు వ్యవహస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు ఆర్టీఏ కార్యాలయాల్లో అవినీతిపై ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నా జిల్లాలో మాత్రం దర్జాగా ఏ జెంట్లతో కుమ్మక్కై ఆర్టీఏ యంత్రాంగం దం దా నడిపుస్తున్నదన్న ఆరోపణలున్నాయి.
అధికారులకు ప్రతినెలా టార్గెట్లు..
ఓ వైపు ఆర్టీఏ కార్యాలయాల్లో బ్రోకర్ల దందా కొనసాగుతుండగా మరోవైపు ఆర్టీఏ అధికారులు వాహనదారులపై తనిఖీల పేరిట కొర డా ఝులిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రవాణా శాఖలో నెలనెలా టార్గెట్లు పెడుతుండడంతో వాహనదారుల జేబుకు చిల్లు పడుతున్నది. ఉన్నతాధికారులు ఇచ్చిన టార్గెట్‌ను అధిగమించకుంటే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నారు. గతంలో వారంలో రెండు, మూడు రోజులు తనిఖీలు చేసే రవాణాశాఖ అధికారులు.. గతేడాదిగా నిత్యం తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఉదయం 7 నుంచి రాత్రి 8 గంటల వరకు జిల్లా మీదుగా వెళ్లే బీజాపూర్ హైవేతోపాటు జిల్లా అంతటా తనిఖీలు చేస్తున్నారు. జిల్లాలో ఇద్దరు ఎంవీఐలు, ఇద్దరు ఏఎంవీఐలున్నారు. ప్రతి ఎంవీఐ ప్రతినెలా రూ.7.50 లక్షల చొప్పున.. ఏఎంవీఐ నెలకు రూ. 10 లక్షల చొప్పున చెల్లించాలని టార్గెట్‌గా పెట్టారు. ఎవరైతే టార్గెట్‌ను చేరుకోలేరో వారికి ఉన్నతాధికారులు మెమోలు జారీ చేస్తున్నట్టు తెలిసింది. వాహనాల ట్యాక్స్‌లతో ఫిట్నెస్ రెన్యువల్ లేని వాహనాలతో ఇతర ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలకు సంబంధించి తనిఖీలు చేస్తూ చలాన్లు విధిస్తున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో టార్గెట్స్ కూడా పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

