షాద్‌నగర్, ఏప్రిల్26 : టీఆర్ఎస్ పాలనలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే షాద్‌నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం షాద్‌నగర్ పట్టణంతో పాటు ఇతర గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలనను కొనసాగిస్తున్నారని చెప్పారు.
ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకొని, అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా నిధులు మంజూరు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారని ఆయన తెలిపారు. నూతనంగా పార్టీలో చేరిన నాయకులు పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషిచేయాలని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
పార్టీలో చేరిన వారిలో ప్రభాకర్, అంచె రాజు, కృష్ణ, నర్సింహ, మొగులయ్య, బాలకిష్టయ్య, రామకృష్ణ, నందు, కనకరాజు, ఎండీ జావేద్, జంగయ్య, రమేష్, రాములు, వెంకటయ్యలతో పాటు సుమారు 500 మంది కార్యర్తలు ఉన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, రాజేష్ పటేల్, లక్ష్మీనర్సింహ్మారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, బాబురావు, దామోదర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.