ఆవిష్యరణలకు వేళాయె..
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లోని సృజనాత్మకత, శాస్త్రీయ నైపుణ్యం వెలికి తీసేందుకు ఏటా నిర్వహించే వైజ్ఞానిక ప్రదర్శన(సైన్స్ ఫెయిర్)ల నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నది.
- ఈ నెలలో వైజ్ఞానిక ప్రదర్శనల నిర్వహణకు విద్యాశాఖ కార్యాచరణ
- భావి శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు దోహదపడనున్న ఎగ్జిబిషన్లు
- ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సదవకాశం
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లోని సృజనాత్మకత, శాస్త్రీయ నైపుణ్యం వెలికి తీసేందుకు ఏటా నిర్వహించే వైజ్ఞానిక ప్రదర్శన(సైన్స్ ఫెయిర్)ల నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నది. ఈ నెలలోనే ప్రదర్శనలను చేపట్టనుండగా.. అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నది. మరోవైపు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు నూతన ఆవిష్కరణలు చేపట్టే దిశగా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆవిష్కరణల్లో అవకాశం కల్పించనున్నారు. రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన ఉన్నత పాఠశాలలు 1300 వరకు ఉన్నాయి.
సామాజిక సమస్యలకు పరిష్కారం చూపేలా విద్యార్థుల ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావడంతోపాటు వారు భావి శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ఈ వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడనున్నాయి. ప్రాజెక్టుల రూపకల్పనకు ఆర్థిక సహకారం అందించడంతోపాటు జిల్లా నుంచి జాతీయ స్థాయి వరకు పోటీలు నిర్వహించి, అవార్డులు అందించి విద్యార్థులను ప్రోత్సహించనున్నారు. ఈ పోటీలను మూడు దశల్లో నిర్వహించనుండగా.. ముందుగా పాఠశాల, మండల స్థాయిలో నిర్వహిస్తారు. అనంతరం నిర్వహించే జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి న విద్యార్థులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తారు. అక్కడ నిర్వాహకులు ప్రాజెక్టులను జాతీయ స్థాయికి ఎంపిక చేసి చివరి దశలో విజేతలను ప్రకటిస్తారు.
-రంగారెడ్డి, డిసెంబర్ 15(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ‘పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లోని శాస్త్రీయ నైపుణ్యం వెలికి తీసేందుకు ‘వైజ్ఞానిక ప్రదర్శన’ లు ముఖ్య వేదికలుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరంలో డిసెంబర్ నెలలో ప్రదర్శనలను నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నది. ఈ మేరకు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా విద్యార్థులను సన్నద్ధులను చేస్తున్నారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆవిష్కరణల్లో అవకాశం కల్పిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ కు చెందిన ఉన్నత పాఠశాలలు 1300 వరకు ఉండగా.. ఈ నెలలో ప్రదర్శనలను నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

ఈసారి నిర్దేశించిన అంశాలివే..
ప్రతి సంవత్సరం ఓ అంశాన్ని ఇచ్చి అందుకు అనుగుణంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నా రు. ఈ ఏడాది పర్యావరణానికి పెద్ద పేట వేసి ‘సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సొసైటీ’ అనే అం శాన్ని ప్రధానంగా నిర్దేశించగా.. ఉప విభాగాలుగా ఆరోగ్యం, లైఫ్ ైస్టెల్ ఫర్ ఎన్విరాన్మెంట్, వ్యవసాయం, కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్ట్, కంప్యూటేషనల్ థింకింగ్‌కు అనుగుణంగా ఆవిష్కరణలను ప్రదర్శించాల్సి ఉంటుంది. విద్యార్థులు రూ పొందించే నూతన ఆవిష్కరణలతో పాటు ఉపాధ్యాయులు సైతం నూతన ఆవిష్కరణలతో బోధ న సామగ్రిని ప్రదర్శించేందుకు అవకాశం ఉం టుంది. వైజ్ఞానిక ప్రదర్శనకు విద్యార్థి వెంట ఒక గైడ్ ఉపాధ్యాయుడు మాత్రమే హాజరు కావాల్సి ఉంటుంది. జూనియర్ విభాగంలో 6 నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులు, సీనియర్ విభాగంలో 9 నుంచి 12వ తరగతి అభ్యసించే వారు పాల్గొనవచ్చు. ప్రతి పాఠశాల నుంచి 3 నుంచి 5 అం శాలపై ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది.
మూడు దశల్లో పోటీల నిర్వహణ
సామాజిక సమస్యలకు పరిష్కారం చూపేలా విద్యార్థుల ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు విద్యాశాఖ ఈ వైజ్ఞానిక ప్రదర్శలను నిర్వహిస్తున్నది. ప్రాజెక్టుల రూపకల్పనకు ఆర్థిక సహకారం అందించడంతోపాటు జిల్లా నుంచి జాతీయ స్థాయి వరకు పోటీలు నిర్వహించి, అవార్డులు ఇస్తూ ప్రోత్సహిస్తున్నది. ఈ పోటీలను మూడు దశల్లో నిర్వహించనున్నారు. ముందుగా పాఠశాల, మండల స్థాయిలో నిర్వహిస్తారు. ఆ తర్వాత జిల్లా స్థాయిలో నిర్వహించి, రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తారు. అక్కడ నిర్వాహకులు ప్రాజెక్టులను జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. చివరి దశలో విజేతలను ప్రకటిస్తారు. విద్యార్థుల మేథస్సును వెలికితీసేందుకు ఏటా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతున్నది.
విద్యార్థులకు మంచి అవకాశం
వినూత్న ఆలోచనల తో నూతన ఆవిష్కరణలు రూపొందించేందుకు విద్యార్థులకు ఇ ది మంచి అవకాశం. ప్రాజెక్టుల రూపకల్పనతో విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఈ నెల చివరలో నిర్వహించే వైజ్ఞానిక ప్రదర్శనలను ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తారా? అనే దానిపై ఉన్నతాధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉన్నది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఇందులో పాల్గొనేలా యాజమాన్యాలు ప్రోత్సహించాలి.
– వై.శ్రీనివాస రావు, జిల్లా సైన్స్ అధికారి, రంగారెడ్డి జిల్లా
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

