హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరుగుతున్న పార్లమెంటేరియన్స్ ఆరో జాతీయ బ్యాడ్మింటన్ పోటీల్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు.
శుక్రవారం సాయంత్రం నలుపు రంగు జెర్సీ ధరించి సహచర పార్లమెంటేరియన్లతో కలిసి ఉత్సాహంగా బ్యాడ్మింటన్ ఆడి ఆకట్టుకున్నారు. గత గురువారం ప్రారంభమైన పోటీలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయని నిర్వాహకులు వెల్లడించారు.