హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): త్వరలోనే ‘డిజిటల్ అసెంబ్లీ, కౌన్సిల్’ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
శుక్రవారం బేగంపేటలోని ఓ హోటల్లో నిర్వహించిన ‘ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కాన్క్లేవ్(తెలంగాణ)’ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించిన ‘హిప్లెక్స్(హైదరాబాద్ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్స్ ఎక్స్పో-2026)లోనూ పాల్గొన్నారు.