మెహిదీపట్నం ఫిబ్రవరి 19: రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య కారులో సౌండ్ పొల్యూషన్ పై(Car sound) జరిగిన గొడవలో ఓ వ్యక్తి గాయాలకు గురై మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, దాడి చేసి గాయపరిచిన వ్యక్తిని లంగర్ హౌస్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గోల్కొండకు చెందిన ఖిజర్ అలియాస్ ఇబ్రహీం అలీ( 35) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవించేవాడు.
ఫిబ్రవరి 15వ తేదీ తెల్లవారుజామున తన కారులో నానల్ నగర్ నుంచి ఇంటికి బయలుదేరాడు. ఒలీవ్ హాస్పిటల్ సమీపంలోకి రాగానే సంగారెడ్డికి చెందిన బొగ్దాది అనే వ్యక్తితో కారులో సౌండ్ విషయంపై గొడవ జరిగింది. ఈ క్రమంలో బొగ్దాది కిజర్ పై దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. గాయాలతో కిజర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదిలా ఉండగా దక్షిణ, తూర్పు మండల టాస్క్ఫోర్స్ పోలీసులు బొగ్దాదిని పట్టుకొని లంగరహౌస్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.