శంషాబాద్ రూరల్ : శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవా రం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. దీంతో కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలికిపడ్డారు. ఏసీబీ అధికారులు కార్యాలయంలోకి రాగానే అధికారుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ డ్రైవర్ వారికి పట్టుపడకుండా పారిపోయి తిరిగి సాయంత్రం కార్యాలయానికి రాగా అతడిని అదుపులోకి తీసుకున్నారు.
దీంతోపాటు తహసీల్దార్ కారులోనూ తనిఖీలు చేశారు. అనంతరం ఏసీబీ డీఎస్సీ ఆనంద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది నుంచి ఫిర్యాదులు రావడంతోపాటు రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. అందులో భాగంగానే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేశామన్నారు. జరిగిన అవకతవకాలపై అధికారులు, సిబ్బంది పాత్ర ఎంత అనే అంశాలను విచారిస్తున్నట్టు చెప్పారు.