బంజారాహిల్స్, జనవరి 11 : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆభరణాల డిజైనర్లతో పాటు దేశంలోని ప్రముఖ డిజైనర్లు రూపొందించిన ఎక్స్‌క్లూజివ్ వజ్రాభరణాలతో ఫిబ్రవరి 25 నుంచి 27వరకు ప్రతిష్టాత్మక అసియా జ్యువెల్లరి షోకు నగరం వేదిక కానుంది.
బుధవారం బంజారాహిల్స్‌లోని మార్క్స్ మీడియా సెంటర్లో ఏర్పాటు చేసిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో జ్యువెల్లరి షోకు సంబంధించిన బ్రోచర్లను టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగిళ్ల, శ్రీలేఖ, అనుశ్రియా తదితరులు ఆవిష్కరించారు. బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణా హోటల్లో ఈ జ్యువెల్లరి షో నిర్వహిస్తున్నామని. ప్రత్యేకమైన వెడ్డింగ్, బ్రైడల్ జ్యువెల్లరీ కలెక్షన్లను ఈ జ్యువెల్లరి షోలో అందుబాటులో ఉంచుతామని నిర్వాహకులు తెలిపారు.