Suicide | షాద్‌నగర్, మార్చి 19 : ఒంటరితనాన్ని భరించలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని రాయికల్ గ్రామంలో బుధవారం వెలుగు చూసింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. రాయికల్ గ్రామానికి చెందిన సంద శ్రీనివాస్ ముదిరాజ్(32) తల్లిదండ్రులు గత కొంతకాలం క్రితం మృతి చెందారు. అప్పటి నుంచి సంద శ్రీనివాస్ ఒంటరితనంతో బాధపడుతున్నాడన్నారు. తల్లిదండ్రుల మృతితో తన ఆలనాపాలన చూసేవారులేని తరచూ బాధపడుతుండేవాడని, ఈ నేపథ్యంలో మనస్థాపానికి గురై సోలీపూర్ సమీపంలోని రైల్వే పట్టాలపై మధ్యాహ్నం 3గంటల సమయంలో వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. ఈ మేరకు షాద్‌నగర్ స్టేషన్ మాస్టర్ అబుదేశ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్ ఢిల్లీ మల్లేశ్ తెలిపారు.