మంచాల మార్చి 15 : ప్రభుత్వ ఉద్యోగం వస్తుందో లేదేనని మనస్థాపానికి గురైన ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్టేషన్ పరిధిలోని చిత్తాపూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై రామన్‌గౌడ్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..చిత్తాపూర్ గ్రామానికి చెందిన గౌర శ్రీకాంత్ (21) ఓపెన్ యూనివర్సీటీలో డిగ్రీ చదువుతున్నాడు.
ప్రభుత్వం వివిధ శాఖల్లో భారీగా కొలువులను ప్రకటించడంతో శ్రీకాంత్ పోలీస్ కానిస్టేబుల్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. కాగా, తనకు కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుందా లేదేనని తీవ్ర మనస్థాపానికి గురైన అతడు ఉదయం వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.