శంషాబాద్ రూరల్, అక్టోబర్ 26 : ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం శంషాఆద్ ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ బాలరాజు, స్థానికుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా అమరచింత మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన వడ్డె మధు(26) తల్లిదండ్రులు, అన్నవదినతో కలిసి శంషాబాద్ మున్సిపాలిటీలోని ఇంద్రారెడ్డి నగర్ కాలనీకి వచ్చి నివాసముంటూ కూలీ పనులు చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. గతకొంత 5 సంవత్సరాత నుంచి రేణుక అనే యువతిని వడ్డె మధు ప్రేమిస్తున్నాడు.
ఇటీవల సదరు యువతి మధును దూరంగా పెట్టడంతో మనోవేదనకు గురైన మధు వారం రోజులుగా తనకు పెండ్లి చేయాలని కుటుంబ సభ్యులను కోరుతున్నాడు. తాజాగా శనివారం రాత్రి తన అన్న ఉంటున్న గదికి వెళ్లి తనకు పెండ్లి చేయాలని తండ్రి, అన్నను కోరాడు. దీంతో వారు కురుమూర్తి జాతర ముగిసిన వెంటనే చేస్తామని చెప్పి రాత్రి ఎవ్వరి గదిరి వారు వెళ్లి నిద్రపోయారు. అయితే మనోవేదనకు గురైన మధు ఉరివేసుకొని మృతి చెందాడు. తాను ప్రేమించిన అమ్మాయి నన్ను మోసం చేసింది. నాకు మళ్లీజన్మంటూ ఉంటే మీకే పుడుతాను అమ్మా..నాన్నా అంటు తన లెటర్లో రాసుకొని మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.