కడ్తాల్, ఏప్రిల్ 24 : మండల పరిధిలోని మైసిగండిలో కారు ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆమనగల్లు మండలం సింగంపల్లికి చెందిన ఆమనగంటి రాములమ్మ (65) ఆదివారం బంధువుల ఫంక్షన్ నిమిత్తం మైసిగండికి వచ్చింది. తిరిగి స్వగ్రామానికి వెళ్లడానికి రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది.
దీంతో బలమైన గాయాలు కావడంతో దవాఖానకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. సోమవారం ఉదయం ఆమె కుమారుడు యాదయ్య చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరిశంకర్ తెలిపారు.