Nandigama | నందిగామ, ఏప్రిల్15 : పని కల్పిస్తామని ఇద్దరు మహిళలను తీసుకెళ్లి బంగారం, నగదు దొంగిలించారు. ఈ ఘటన మంగళవారం కొత్తూర్, నందిగామ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ, సత్యమ్మ అనే ఇద్దరూ మహిళలు కూలీ పనుల కోసం మంగళవారం ఉదయం కొత్తూర్ లేబర్ అడ్డా వద్ద ఉండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పని కల్పిస్తానని నమ్మించాడు. అనంతరం ఇద్దరిని భైకుపై తీసుకొని పెంజర్ల రోడ్డులో ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ మరో వ్యక్తితో కలిసి మహిళల మెడలో ఉన్న పుస్తెల తాడు, రూ.5000 నగదు లాక్కుని అక్కడ నుండి పారిపోయారు. దీంతో బాధితులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సిసి కెమెరాలను పరిశీలించి దుండగుల కోసం గాలింపు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.