సీఎం కేసీఆర్‌తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యం. ఆయనకు దీటుగా కాంగ్రెస్ పార్టీలో ఎవ రూ లేరు. ఆ పార్టీ మాటలను ప్రజలు నమ్మి మోసపోవద్దు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించినా మహిళల పేరుతో నే ఆరంభిస్తున్నది. రాష్ర్టాన్ని దేశానికి దీటుగా నిలిపిన నాయకుడు మన ముఖ్యమంత్రి. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న షాబాద్ మండలాన్ని పట్నం కుటుంబం ఊహించని రీతిలో ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తున్నది. నియోజకవర్గాభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న కాలె యాదయ్యను ఈ ఎన్నికల్లోనూ ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు భారీ మెజార్టీతో గెలిపించాలి. -తీగల అనితారెడ్డి, జడ్పీ చైర్పర్సన్
షాబాద్, అక్టోబర్ 26: తెలంగాణ ప్రజలు కాం గ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదని.. ఆరు గ్యారంటీలన్నీ బూటకమేనని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గను లు, భూగర్భవనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం నాగరగూడ నుంచి షాబాద్ వరకు స్థానిక జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 2వేల బైకులతో నిర్వహించిన భారీ బైకు ర్యాలీలో మంత్రితోపాటు జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రంలో అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మె పరిస్థితి లేదని.. వాళ్లు చెబుతున్న ఆరు గ్యారంటీలన్నీ బూటకమేనని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు.. ఇచ్చేది లేదన్న విషయాన్ని ప్రజలంతా గమనించాలన్నారు. కానీ సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలతోపాటు.. మ్యానిఫెస్టోలో పెట్టని పలు అంశాలను కూడా అమలు చేస్తున్నారని కొనియాడారు. ఎన్నికల సమయంలో రైతుబంధు నిధులను నిలిపివేయాలని కాంగ్రెస్ నాయకులు ఈసీకి లేఖ రాయడం సరికాదన్నారు. ఓటమి భయంతోనే సంక్షేమ పథకాలను ఆపేయాలని వారు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాతే సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో షాబాద్ మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు. దేశ, విదేశాలకు చెందిన పలు కంపెనీలు, సం స్థలు ఇక్కడ ఏర్పాటు కావడంతో ప్రపంచం చూపు షాబాద్ వైపు మళ్లిందన్నారు. అంతేకాకుండా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తు న్నా యన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముందు కు సాగుతున్నదన్నారు. పట్టణాలకు దీటుగా గ్రామాలను కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నదన్నారు. అంతేకాకుండా గ్రామాల పరిధిలోని వాగులపై వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం నిధులను కేటాయిస్తున్నట్లు మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడంలేదని ఆ రాష్ర్టానికి చెందిన రైతులు కొడంగల్‌కు వచ్చి ఆందోళన చేస్తున్నారని తెలిపారు. మేమూ కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి మోసపోయామని.. మీరు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే చీకటి రోజులు తప్పవని హెచ్చరిస్తున్నారని పేర్కొన్నా రు.
సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందున్నదని.. అందువల్ల రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలె యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులు, ప్రజలకు సూచించారు. ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ లక్ష్మీరాజేందర్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ చల్లా శేఖర్‌రెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు గూడూరు నర్సింగ్‌రావు, చల్లా శ్రీరాంరెడ్డి, మాజీ జడ్పీటీసీ రాజేందర్‌గౌడ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శేరిగూడెం వెంకటయ్య, నక్క శ్రీనివాస్‌గౌడ్, నర్సింహారెడ్డి, కౌకుంట్ల రాజేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కొలన్ ప్రభాకర్‌రెడ్డి, మండల కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు కృష్ణాగౌడ్, జంగయ్య, రమేశ్‌యాదవ్, నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రాములు, మల్లేశ్, పాండురంగారెడ్డి, దర్శన్, పెంటయ్య, చంద్రశేఖర్, ఎంపీటీసీ మధుకర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, గణేశ్‌గౌడ్, సంజీవరెడ్డి, గోపాల్, ఇబ్రహీం, ఇమ్రాన్, ముఖ్రంఖాన్, సుదర్శన్, ప్రతాప్‌రెడ్డి, రాంరెడ్డి, మునీర్, సందీప్, శ్రీనివాస్‌గౌడ్, నర్సింహులు, శ్రీను, రాంచందర్, రాంచంద్రారెడ్డి, బల్వంత్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, అవిలాశ్గౌడ్, దయాకర్‌చారి, వెంకట్‌రెడ్డి, శ్రీశైలంగౌడ్, శ్రీకాంత్‌రెడ్డి, ప్రదీప్, ఇనాయత్, కృష్ణ, దేవేందర్‌రెడ్డి, సుధాకర్‌గౌడ్, పార్టీ శ్రేణులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నది. గత పదేండ్ల కాలంలో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరుగని అభివృద్ధి తెలంగాణలో జరిగింది. సీఎం కేసీఆర్ తెలం గాణను దేశానికే ఆదర్శంగా నిలిపారు. ఎన్నికల్లో 20 గంటల పాటు విద్యుత్తును సరఫరా చేస్తామని కర్ణాటకలో అధికారంలోని వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఐదు గంటలపాటు కూడా సరిగ్గా సరఫరా చేయకపోవడంతో ఆ రాష్ట్ర రైతులు కొడంగల్‌కు వచ్చి ఆందోళన చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో మన రైతులందరూ సంతోషంగా ఉన్నారు. ముఖ్యమంత్రి తెలంగాణలో సంపదను పెంచి అన్ని వర్గాల ప్రజలకు పంచుతున్నారు.
దేశ, విదేశాల కంపెనీల ఏర్పాటుతో షాబాద్ మండలం ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందింది. ప్రపంచంలోనే అతి పెద్దదైనా కిటెక్స్ కంపెనీ సీతారాంపూర్‌లో ఏర్పాటైతే మహిళలకు అధిక సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయి. ప్రతి రాష్ర్టానికీ అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. మనం అమలు చేస్తున్న పథకాలను కాపీ కొట్టి ఆరు గ్యారంటీలని కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెడుతున్నది. ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేసే మన నాయకుడు సీఎం కేసీఆర్‌ను మరోసారి గెలిపించి హ్యాట్రిక్ సీఎంగా నిలపాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. అదేవిధంగా కాలె యాదయ్యను కూడా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి.
-డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ
ప్రజలు కాంగ్రెస్, బీజేపీల మాటలు నమ్మితే రాష్ట్రం అన్ని రంగాల్లో మళ్లీ వెనక్కి పోతుంది. తెలంగాణ ప్రభుత్వం పేదలు, రైతుల పక్షపాతిగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ది. 2014 ముందు తెలంగాణ ఏలా ఉండే.. ఇప్పుడు ఏలా ఉందో ప్రజలు గమనించి రానున్న ఎన్నికల్లో అభివృద్ధికి కృషి చేసే వారికి.. ప్రజల మధ్య ఉండే వారిని ఎన్నుకోవాలి. గత పదేండ్లుగా ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశా. షాబాద్ మండలంలోని చందనవెల్లి, హైతాబాద్, సీతారాంపూర్ తదితర గ్రామాల్లో పలు కంపెనీల ను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నా. ఇటీవలె సీతారాంపూర్‌లో కిటెక్స్ కంపెనీ తమ శాఖ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది.. ఆ పనులు పూర్తై సుమారు 30వేల వరకు మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు మరోసారి సేవ చేసేందుకు సీఎం కేసీఆర్ తనకు మూడోసారి అవకాశం ఇచ్చారు. అందువల్ల తనను రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలి.
-కాలె యాదయ్య, చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి
సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా తీసుకెళ్లాలి. సుమారు 2వేల బైకుల ర్యాలీతో ప్రచారాన్ని ప్రారంభించడం సంతోషకరం. త్వరలో మండలంలోని 41 గ్రామ పంచాయతీల్లో ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహిస్తాం. రానున్న ఎన్నికల్లో కాలె యాదయ్య భారీ మెజార్టీతో మూడోసారి కూడా గెలువడం ఖాయం.
-పట్నం అవినాశ్‌రెడ్డి, జడ్పీటీసీ షాబాద్