రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పెను ప్రమాదం తప్పింది. ఓల్డ్ టైర్స్ స్క్రాప్ లోడుతో వెళ్తున్న డీసీఎంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. తెల్లవారు జామున ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.