ఒకప్పుడు సర్కారు బడులంటే సమస్యల పుట్టలు.. తెలంగాణ ప్రభుత్వమొచ్చాక సమూల మార్పులు జరిగాయి. ‘మన ఊరు-మన బడి’తో సకల సౌకర్యాలు సమకూరడంతో కొత్తరూపు సంతరించుకున్నాయి. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 1054 ప్రభుత్వ పాఠశాలలుండగా, తొలి విడుతలో ఎంపికైన 371 స్కూళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రాష్ట్ర సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎంపికైన వాటిలో చిన్నచిన్న పనులు మినహా 50 శాతానికిపైగా స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దారు. ఇందులో 41 స్కూళ్లలో తాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, విద్యుత్, గ్రీన్ చాక్‌బోర్డులు, పెయింటింగ్, ప్రహరీ, కిచెన్ షెడ్ల నిర్మాణం, శిథిలమైన తరగతి గదుల మరమ్మతులు, కొత్త గదుల నిర్మాణం, డిజిటల్ విద్యకు అవసరమైన ఏర్పాట్లు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్లు తదితర పనులు పూర్తి కాగా, ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా మొదటి విడుతలో ఎంపికైన స్కూళ్లను సిద్ధం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
వికారాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులను తీసుకువచ్చేందుకు చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పనులు వేగంగా జరుగుతున్నాయి. మొదటి విడుతలో ఎంపిక చేసిన స్కూళ్లలో జిల్లావ్యాప్తంగా 41 స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తికాగా.. ప్రారంభానికి జిల్లా విద్యాశాఖ సిద్ధం చేస్తున్నది. కొన్ని స్కూళ్లకు పెయింట్ వేయాల్సి ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొదటి విడతలో చేపట్టిన పనుల్లో ఇప్పటివరకు 50 శాతానికిపైగా స్కూళ్లలో పనులు పూర్తయ్యాయి. ఈ స్కూళ్లలో పనులను ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. సంబంధిత పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో తాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, విద్యుత్, గ్రీన్ చాక్‌బోర్డులు, పెయింటింగ్, ప్రహరీలు, కిచెన్ షెడ్లు, శిథిలమైన తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులు, డిజిటల్ విద్యకు అవసరమైన ఏర్పాట్లు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
41 స్కూళ్లు ప్రారంభానికి సిద్ధం
మొదటి విడుతలో ఎంపిక చేసిన స్కూళ్లలో ఉన్నత పాఠశాలలు-111, ప్రాథమికోన్నత పాఠశాలలు-40, ప్రాథమిక పాఠశాలలు-220 ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 41 స్కూళ్లలో పనులన్నీ పూర్తయ్యాయి. మిగతా స్కూళ్లలో 50 శాతానికిపైగా పనులు పూర్తికావడంతోపాటు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు అంచనాలు పూర్తయిన 371 స్కూళ్లలో మౌలిక సదుపాయల పనులను చేపట్టేందుకు ఇప్పటివరకు జిల్లాకు రూ.5కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
వేగంగా జరుగుతున్న పనులు
– రేణుకాదేవి, డీఈవో
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించే పనులు వేగంగా జరుగుతున్నాయి. మొదటి విడుతలో ఇప్పటివరకు 41 స్కూళ్లలో 100 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా స్కూళ్లలో కూడా వివిధ దశల్లో పనులు కొనసాగుతున్నాయి. మౌలిక సదుపాయాల పనులను చేపట్టేందుకు ఇప్పటివరకు రూ.5కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలోగా పనులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టాం.
ప్రారంభానికి సిద్ధమైన స్కూళ్లు..
మండలం : పాఠశాల
బషీరాబాద్ : ఎంపీపీఎస్ మంతటి
బషీరాబాద్ : ఎంపీయూపీఎస్ పర్వతపల్లి
బొంరాస్‌పేట్ : ఎంపీపీఎస్ దీప్లానాయక్ తండా
బొంరాస్‌పేట్ : ఎంపీపీఎస్ చెట్టుపల్లి తండా
చౌడాపూర్ : ఎంపీపీఎస్ మండిపల్
చౌడాపూర్ : ఎంపీపీఎస్ వెంకటాపూర్
ధారూరు : ఎంపీపీఎస్ అల్లాపూర్
ధారూరు : ఎంపీపీఎస్ రాజాపూర్
దోమ : ఎంపీయూపీఎస్ శివారెడ్డిపల్లి
దోమ : ఎంపీపీఎస్ మోత్కూర్
దౌల్తాబాద్ : ఎంపీపీఎస్ నర్సాపూర్
దౌల్తాబాద్ : ఎంపీపీఎస్ నందాపూర్
కొడంగల్ : ఎంపీపీఎస్ హస్నాబాద్
కొడంగల్ : ఎంపీపీఎస్ అంగడిరాయిచూర్
కోట్‌పల్లి : ఎంపీపీఎస్ మల్‌శెట్టిపల్లి తండా
కోట్‌పల్లి : ఎంపీపీఎస్ అన్నాసాగర్
కుల్కచర్ల : ఎంపీపీఎస్ సాల్విడ్
కుల్కచర్ల : ఎంపీపీఎస్ ముజాహిద్పూర్
మర్పల్లి : ఎంపీపీఎస్ బుచాన్పల్లి
మర్పల్లి : ఎంపీపీఎస్ సిరిపురం
మోమిన్‌పేట్ : ఎంపీయూపీఎస్ అమ్రాదికుర్దు
మోమిన్‌పేట్ : ఎంపీపీఎస్ చంద్రాయన్పల్లి
నవాబుపేట్ : ఎంపీపీఎస్ చించల్పేట్
నవాబుపేట్ : ఎంపీపీఎస్ గొల్లగూడ
నవాబుపేట్ : ఎంపీపీఎస్ మాదారం
నవాబుపేట్ : ఎంపీపీఎస్ నవాబుపేట్
పరిగి : ఎంపీయూపీఎస్ కడ్లాపూర్
పరిగి : ఎంపీయూపీఎస్ చిగురాల్‌పల్లి
పెద్దేముల్ : ఎంపీపీఎస్ కందనెల్లి
పెద్దేముల్ : ఎంపీపీఎస్ మంబాపూర్
పూడూరు : ఎంపీపీఎస్ మన్నెగూడ
పూడూరు : ఎంపీపీఎస్ సోమన్గుర్తి
పూడూరు : ఎంపీయూపీఎస్ మేడిపల్లికలాన్
తాండూరు : ఎంపీపీఎస్ ఎస్సీ కాలనీ
తాండూరు : ఎంపీపీఎస్ గౌతాపూర్
వికారాబాద్ : ఎంపీపీఎస్ పుల్మామిడి (ఉర్దూ మీడియం)
వికారాబాద్ : ఎంపీపీఎస్ పుల్మామిడి
యాలాల : ఎంపీపీఎస్ రాస్నం
యాలాల : ఎంపీపీఎస్ ముద్దాయిపేట
బంట్వారం : ఎంపీపీఎస్ తొర్మామిడి