తులం రూ.1.64 లక్షలు
బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. గత కొన్ని రోజులుగా పుంజుకుంటు వచ్చిన పుత్తడి సోమవారం ఐదు నెలల గరిష్ఠ స్థాయిని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పెరుగడంతోపాటు అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ ముదురుతుండటంతో మదుపర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన గోల్డ్ వైపు మళ్లించడంతో వీటి ధరలు పుంజుకుంటున్నాయి.
- ఐదు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్న పుత్తడి ధర
న్యూఢిల్లీ, ఆగస్టు 24: బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. గత కొన్ని రోజులుగా పుంజుకుంటు వచ్చిన పుత్తడి సోమవారం ఐదు నెలల గరిష్ఠ స్థాయిని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పెరుగడంతోపాటు అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ ముదురుతుండటంతో మదుపర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన గోల్డ్ వైపు మళ్లించడంతో వీటి ధరలు పుంజుకుంటున్నాయి.
అంతర్జాతీయ పరిణామాలతోపాటు దేశీయంగా పండుగ సీజన్ కూడా ప్రారంభంకావడంతో అమ్మకాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1.64 లక్షలు దాటింది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి 99.9 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర రూ.900 ఎగబాకి రూ.1,64,400 పలికింది. గత వారంలో రూ.1,63,500గా ఉన్నది. ఈ విషయాన్ని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. మార్చి 9న నమోదైన రూ.1,64,300 తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి కావడం విశేషం.
వెండి మరో రూ.3,500
బంగారంతోపాటు వెండి ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతోపాటు రిటైల్ విక్రయాలు అధికమవడంతో కిలో వెండి రూ.2.53 లక్షలు దాటింది. గతవారం ముగింపుతో పోలిస్తే రూ.,3500 ఎగబాకి రూ.2,53,500 పలికింది. వరుసగా మూడు రోజులుగా వెండి రూ.10 వేలకు పైగా ఎగబాకినట్టు అయింది. అలాగే ఏప్రిల్ 17న నమోదైన రూ.2.53 లక్షల తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి. డాలర్ బలహీనపడటంతో ధరలు పెరిగాయని కొటక్ సెక్యూరిటీస్ రీసర్చ్ హెడ్ కైనత్ చైనావాలా తెలిపారు. రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, ద్రవ్యోల్బణ భయాలు కూడా ధరలు పెరుగడానికి కారణాలన్నారు. గోల్డ్ ధర 42.45 డాలర్లు లేదా ఒక్క శాతం ఎగబాకి 4,646.54 డాలర్లకు చేరుకోగా, వెండి 69 డాలర్ల వద్ద ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- gold
- Gold one gram
- Gold prices
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

