Watch: జీబ్రా క్రాసింగ్ వద్ద ఇన్ఫ్లుయెన్సర్ రీల్ షూట్.. తర్వాత ఏం జరిగిందంటే?
Indore Influencer Prakriti Gaur | సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన యువతి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్న జీబ్రా క్రాసింగ్ వద్ద రీల్ రికార్డ్ చేసింది. జీబ్రా క్రాసింగ్‌పై ఆమె పడుకుని పలు స్టిల్స్ ఇచ్చింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెపై చర్యలు చేపట్టారు.
భోపాల్: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన యువతి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్న జీబ్రా క్రాసింగ్ వద్ద రీల్ రికార్డ్ చేసింది. జీబ్రా క్రాసింగ్‌పై ఆమె పడుకుని పలు స్టిల్స్ ఇచ్చింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెపై చర్యలు చేపట్టారు. (Indore Influencer Prakriti Gaur) భోపాల్‌లోని ఇండోర్‌కు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రకృతి గౌర్ ఇటీవల ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రీల్ షూట్ చేసింది. రెడ్ సిగ్నల్ పడటంతో అక్కడ వాహనాలు నిలిచాయి. ఈ సందర్భంగా ప్రకృతి గౌర్ అక్కడి జీబ్రా క్రాసింగ్ వద్ద పడుకుని పలు స్టిల్స్ ఇచ్చింది.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇండోర్ పోలీసులు స్పందించారు. ప్రకృతి గౌర్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆమె మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినప్పటికీ, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే ఎవరిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
మరోవైపు తన వీడియోపై ఆన్లైన్లో విమర్శలు వెల్లువెత్తడంతో ప్రకృతి గౌర్ క్షమాపణలు చెప్పింది. కొందరు వ్యక్తులు తన వీడియోను సందర్భోచితం కాకుండా తప్పుగా చూపిస్తున్నారని ఆమె ఆరోపించింది. వీడియో చిత్రీకరించేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలను తాను ఉల్లంఘించలేదని పేర్కొంది. అయితే భవిష్యత్తులో బహిరంగ ప్రదేశాల్లో వీడియోలు చిత్రీకరించేటప్పుడు మరింత జాగ్రత్త వహిస్తానని వెల్లడించింది.
इंदौर: ट्रैफिक सिग्नल पर युवती की अजीब हरकत, वीडियो वायरल होने के बाद पुलिस करेगी कार्रवाई
इंदौर के विजय नगर इलाके में रील बनाने का एक हैरान करने वाला वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है। वीडियो में एक इंफ्लुएंसर युवती ट्रैफिक सिग्नल के पास जेब्रा क्रॉसिंग पर लेटकर फोटो और… pic.twitter.com/FCEfbpVb5u
— Bansal News Official (@BansalNews_) August 22, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

