ఆదిబట్ల, ఏప్రిల్ 5: మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల నేడు ప్రతి ఒక్కరికి వ్యాయామం చాలా అవసరం. ఒకప్పుడు జిమ్ అనేది నగరాలకు మాత్రమే పరిమితమైంది. దీంతో జిమ్ ద్వారా వ్యాయామం చేసుకోవడానికి అందరికి అవకాశం ఉండేది కాదు. మరో విధంగా చెప్పాలంటే కాస్త డబ్బున్న వారు మాత్రమే జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేసే వారు. కానీ నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం అలాంటి పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.
ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో ఆదిబట్ల, కొంగర కలాన్, బొంగుళూరు, మంగల్‌పల్లి, పటేల్‌గూడ, రాందాస్‌పల్లి గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 20 వేల జనాభా ఉంది. వీరందరూ వ్యాయామం చేసుకోవడానికి నాలుగు గోడల మధ్యన జిమ్‌లు ఏర్పాటు చేసే దాని కంటే అంతకంటే మంచిగా, ఆహ్లాదకరమైన వాతావరణం లో ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం అన్ని ప్రాం తాల్లో ఓపెన్‌జిమ్‌ల ఏర్పాటును తీసుకువచ్చింది. అందు లో భాగంగా ప్రతి గ్రామానికి రూ.6 లక్షల వ్యయంతో బహిరంగ ప్రదేశాల్లో ఒక్కో ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేసింది. దీంతో అన్ని వర్గాల ప్రజలు అక్కడికి వచ్చి కరసత్తులు చేస్తున్నారు. ప్రైవేటు జిమ్‌లకు దీటుగా అన్ని రకాల వసువ్తులను ఓపెన్ జిమ్‌లలో అందుబాటులో ఉంచారు. దీంతో యువత వీటి ద్వారా కసరత్తులు చేసుకోవడానికి ఆసక్తి పెంచుకుని ఆరోగ్యాలను కాపాడుకుంటున్నారు. ఓపెన్ జిమ్‌లు రావటం వల్ల గ్రామాల్లో వ్యాయామశాలలు లేవన్న వెలితి లేకుండా పోయింది.
వ్యాయామం అనేది నేటి కాలంలో ప్రతి ఒక్కరి అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకునే మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి గ్రామంలో ఓపెన్‌జిమ్‌లను ఏర్పాటు చేశాం. వీటిని అన్ని వర్గాల వారు ఆదరిస్తున్నారు. ప్రధానంగా యువత ఎక్కువగా సద్వినియోగం చేసుకుటుంది. జిమ్‌లలో వస్తువులు పాడైతే మున్సిపాలిటీ కార్యాలయంలో సమాచారం ఇస్తే వాటిని వెంటనే మరమ్మతులు చేయిస్తాం. – అమరేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్
ఓపెన్‌జిమ్‌లు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉద్యోగ విధుల్లో కాలంతో పోటీ పడుతున్న వారికి సమయంతో సంబం ధం లేకుండా వీటిని వినియోగించుకోవచ్చు. సాయంత్రం సమయంలో ఓపెన్ జిమ్‌లకు వచ్చి చిన్న చిన్న కసరత్తులు చేసుకుంటాను.
– సత్యనారాయణ, ఆదిబట్ల