Rangareddy | నందిగామ, జూన్ 05 : నందిగామ మండలం రంగపూర్ గ్రామానికి చెందిన వనంపల్లి మల్లేష్ తన పొలం వద్ద ఉన్న షెడ్డులో గత కొన్ని రోజులుగా నాటు కోళ్లను పెంచుతున్నాడు. బుధవారం రాత్రి వీధి కుక్కలు షెడ్డుకు ఉన్న ఇనుప జాలిని తొలగించుకొని షెడ్డులో ఉన్న కోళ్ల పై కుక్కలు దాడి చేశాయి. వీధి కుక్కల దాడిలో సుమారు 300 నాటు కోళ్లు మృతి చెందాయి. సుమారు రూ.3 లక్షల వరకు నష్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు మల్లేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.