షాద్నగర్టౌన్, జనవరి 18 : ఆర్టీసీ బస్సుల్లో మగవారికి 50శాతం సీట్లు కేటాయించాలని ప్రయాణికులు డయల్ యువర్ డీఎం కార్యక్రమం ద్వారా ఫిర్యాదు చేసినట్లు షాద్నగర్ ఆర్టీసీ డీఎం ఉష తెలిపారు. గురువారం డిపోలో నిర్వహించిన డయల్ యువర్ డీఎం కార్యక్రమానికి 25 ఫిర్యాదులు వచ్చాయన్నారు.
ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడంతో మగవారు ఇబ్బందులు పడుతున్నట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. మహిళా ఉద్యోగిణులకు ఉచిత ప్రయాణాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. అదేవిధంగా చౌడాపూర్కు బస్సును పునరుద్ధరించాలని.. పలు గ్రామాలకు బస్సుల సంఖ్యను పెంచాలని కోరారు. వచ్చిన ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.