విశ్వనగరం ఎన్నికలకు సర్వం సిద్ధం

మణికొండ/బండ్లగూడ/ మైలార్‌దేవ్‌పల్లి/నవంబర్ 30: హైదరాబాద్ మహానగర పాలకవర్గంలో స్థానానికి పోటాపోటీ ప్రచారహోరులు...ప్రజాకర్శనలు... హామీలు... ఆప్యాయతలు... దం డాలు... ఇంటింటా తిరిగి వేడుకోలు...కరపత్ర ప్రచారాలన్నీ ఆదివారంతో ముగిసిపోయాయి. సమర్ధవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రజాక్షేత్రంలో జరిగే బ్యాలెట్ భవితవ్యాన్ని నేడు ప్రజలకు ఉన్న వజ్రాయుధం ఓటుహక్కును వినియోగించుకోను న్నారు. అందుకు సంబంధించి రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఐదు డివిజన్లలో ఎన్నికలను జీహెచ్ఎంసీ అధికారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.
ఈసారి జీహెచ్ఎంసీ ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ఓటర్లు సులభంగా ఓటర్ స్లిప్పులను డౌన్లోడ్ చేసుకొనే అవకాశాన్ని కూడా ఓటర్ల కోసం కల్పించారు. ఓటు విలువను పలు రకాలుగా ప్రచారాన్ని కూడా చేపట్టారు. ప్రతి ఒక్క రూ ఓటు హక్కును వినియోగించుకొనేలా ఏర్పాట్లు పూర్తిచేశారు. సోమవారం రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాలలో భద్రపర్చిన ఈవీఎంలను పోలింగ్ సిబ్బందికి అప్పగించి పోలింగ్ నిర్వహణకు అవసరమైన సామగ్రిని అందజేసి ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించారు. నేడు(మంగళవారం) ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్కిల్ పరిధిలోని 316 పోలింగ్ స్టేషన్లలో 2,67,144 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
పోలీసుల భారీ బందోబస్తు
తాజావార్తలు
- సంతోష్ బాబు పోరాటం.. సమాజానికి స్ఫూర్తిదాయకం
- కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
- వారానికి 4 రోజులే.. కరోనా టీకా
- సిటిజన్ కాప్స్
- ప్రయాణం ఏదైనా కార్డు ఒక్కటే..
- వైద్య శిబిరాలను వినియోగించుకోవాలి
- మహేశ్వరం మండలానికి నాలుగులేన్ల రోడ్డు
- బాధిత కుటుంబాలకు భరోసా..
- సీబీఎస్‌లో సౌకర్యవంతంగా...
- దోమలపై ఎంటమాలజీ యుద్ధం