శనివారం 23 జనవరి 2021
Rangareddy - Nov 29, 2020 , 06:39:06

తొండుపల్లిలో చిరుత లేదు

తొండుపల్లిలో చిరుత లేదు

శంషాబాద్‌ రూరల్‌: శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి శివారులో చిరుత సంచరిస్తున్నట్టు సోషల్‌ మీడియాలో జరిగిన ప్రచారం అవాస్తవమని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. తొండుపల్లిలోని ఓ వెంచర్లో ఉంటున్న బీహార్‌ యువకులు  రాత్రి తమకు చిరుత కనిపించిందని తొండుపల్లి వాసులకు చెప్పారు. స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు మంద రవి, బక్క శ్రీధర్‌తోపాటు యువకులు అటవీశాఖ, పోలీసులకు సమచారం అందజేశారు. అధికారులు తొండూరుకు వెళ్లి బీహార్‌ యువకులతో మాట్లాడి.. చిరుతను చూసినట్టు చెప్పిన స్థలాన్ని పరిశీలించారు. అక్కడ చిరుతపులి అడుగులు లేవని నిర్ధారించారు. అక్కడికి వచ్చింది చిరుత కాదనీ, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


logo