బడంగ్‌పేట, జూలై 23 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. 200 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్టాభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ర్టాన్ని అధోగతిపాలు చేసే అవకాశాలున్నాయని.. ఆపార్టీలను ప్రజలు నమ్మడం లేదన్నారు. పార్టీ కోసం పనిచేసేవారికి సముచిత స్థానం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలు, మతాలకు సముచిత స్థానం ఇస్తున్నారని ప్రజలు నమ్ముతున్నారని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు తేజస్వి, లావణ్య, రవినాయక్, సుమన్, బీఆర్ఎస్ నాయకులు బషీర్, వీరేశ్‌గౌడ్, జయశ్రీ, శ్రీలత, సామ్యూల్ రాజు, సుందరయ్య, శ్రీలత, నాజర్, బాషా, ప్రవీణ్, వెంకటేశ్ ఉన్నారు.