అతివలకు ‘ఆరోగ్యమస్తు’
పురుషులతో పోల్చుకుంటే మహిళలు అనారోగ్య సమస్యలను అధికంగా ఎదుర్కొంటూ ఉంటున్నారు. సమస్యను ఆదిలోనే గుర్తించకుంటే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం గత యేడాది ప్రారంభించిన ఆరోగ్య మహిళా సేవలు ఆదరణను చూరగొంటున్నాయి.
- గత యేడాది కేసీఆర్ ప్రభుత్వంలో జిల్లాలో 20 ఆరోగ్య మహిళా కేంద్రాల ఏర్పాటు
- ప్రతి మంగళవారం ఎనిమిది రకాల వ్యాధులకు ఉచిత పరీక్షలతో మందుల అందజేత
- ప్రాథమిక స్థాయిలోనే వ్యాధుల నిర్ధారణ
- జిల్లాలో ఇప్పటివరకు సేవలు పొందినమహిళలు 38,133 మంది
రంగారెడ్డి, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : పురుషులతో పోల్చుకుంటే మహిళలు అనారోగ్య సమస్యలను అధికంగా ఎదుర్కొంటూ ఉంటున్నారు. సమస్యను ఆదిలోనే గుర్తించకుంటే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం గత యేడాది ప్రారంభించిన ఆరోగ్య మహిళా సేవలు ఆదరణను చూరగొంటున్నాయి. జిల్లాలో దశల వారీగా 20 కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి మంగళవారం ఎనిమిది రకాల వ్యాధులకు సంబంధించి ఉచిత పరీక్షలు నిర్వహించడంతోపాటు మందులను అందజేస్తున్నారు. జిల్లాలో ఆరోగ్య మహిళా కేంద్రాలు ఆదరణను చూరగొంటుండగా.. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 38,133 మంది సేవలను పొందారు.
ప్రతి మంగళవారం ప్రత్యేక సేవలు..
జీవనశైలిలో మార్పులు, అలవాట్లు, ఒత్తిడి, ఆందోళనలతో ఇటీవలి కాలంలో ఎక్కువ మంది మహిళలు హార్మోన్ల అసమతుల్యత(పీసీవోఎస్), థైరాయిడ్ సమస్యల బారిన పడుతున్నారు. రక్త హీనత, మెనోపాజ్ సమస్యలతోనూ బాధపడుతున్నారు. ఈ తరహా సమస్యలను ఆరంభంలోనే గుర్తించకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం మహిళలలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి పరీక్షలు నిర్వహించి ఆదిలోనే వ్యాధులను నిర్ధారించి ఉచితంగా చికిత్స అందజేయడంతోపాటు మందులను అందజేస్తున్నారు. స్థానికంగా చికిత్స సదుపాయం లేనిపక్షంలో ఆపై ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు.
ఉచితంగా 8 రకాల పరీక్షలు..
ఎంపిక చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రతి మంగళవారం మహిళా వైద్య, ఆరోగ్య సిబ్బంది పరీక్షలు అందుబాటులో ఉండి ఉచితంగా పరీక్షలు చేస్తున్నారు.
- 1 మధుమేహం, రక్తపోటు, రక్త హీనత, ఇతర సాధారణ పరీక్షలు
- 2 ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్ పరీక్షలు
- 3 థైరాయిడ్, సూక్ష్మ పోషకాల లోపాలు, అయోడిన్ సమస్య, పోలిక్ యాసిడ్, ఐరన్ లోపం తదితర వాటిని
గుర్తించే పరీక్షలు - 4 మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు
- 5 మెనోపాజ్ పరీక్షలతోపాటు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడం, కౌన్సిలింగ్‌తో అవగాహన
- 6 నెలసరి, సంతాన సమస్యలపై ప్రత్యేక పరీక్షలు, ఆల్ట్రా సౌండ్ పరీక్షలు
- 7 లైంగిక సంబంధిత, అంటు వ్యాధులకు సంబంధించిన పరీక్షలు
- 8 బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటి
వాటిపై అవగాహన
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,109 పాయింట్లు లాభం
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల్లో అవగాహణ ఎంతో అవసరం
Jatayu | ‘రామాయణం’లో జటాయువుగా అనుపమ్ ఖేర్!
CPR | సీపీఆర్ అంటే ఏమిటి.. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఇది ఎందుకు కీలకం..
రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు భీమవరం విద్యార్థినులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

