శంషాబాద్ రూరల్, జూలై 15: శంషాబాద్‌లో (Shamshabad) ఓ యువతి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ కుటుంబం జీవనోపాధి నిమిత్తం శంసాబాద్ మండలం మదనపల్లికి వలస వచ్చింది. కుటుంబ సభ్యులు ఇక్కడే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజూలానే సోమవారం కూడా కుటుంబ సభ్యులు కూలి పనులకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న వారి కూతురు హేమ్ కుమారి చతుర్వేది (19).. సాయంత్రం వారు తిరిగి వచ్చేవరకు కనిపించకుండా పోయింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో రాత్రి పొద్దుపోయే వరకు వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మంగళవారం ఉదయం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన దర్యాప్తు చేస్తున్నారు.