e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home జిల్లాలు పుట్టిన రోజున బహుమతై..ఆపదలో బందువై..

పుట్టిన రోజున బహుమతై..ఆపదలో బందువై..

పుట్టిన రోజున బహుమతై..ఆపదలో బందువై..

ఏడాదిగా వేల మందిని దవాఖానలకు తరలింపు
గతేడాది మంత్రి కేటీఆర్‌ జన్మదినం కానుకగా నియోజకవర్గాలకు బహూకరించిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ ,ఎమ్మెల్యే
ఉమ్మడి జిల్లాలో 8 వాహనాలు
ఉత్తమ సేవలందిస్తున్న ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ అంబులెన్స్‌లు

రంగారెడ్డి, జూలై 17, (నమస్తే తెలంగాణ):మారుమూల పల్లెలకు సైతం అంబులెన్స్‌ సేవలు అందాలనే ఉద్దేశంతో మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ గతేడాది ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాలకు 108 వాహనాలను బహూకరించారు. అప్పటి నుంచి ఇవి వేల మందిని క్షతగాత్రులను, బాలింతలు, గర్భిణులను దవాఖానలకు చేర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 8 ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ అంబులెన్స్‌లు సేవలందిస్తున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మహేశ్వరం నియోజకవర్గానికి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి రాజేంద్రనగర్‌, చేవెళ్ల, తాండూరు, కులకచర్ల, వికారాబాద్‌లోని ప్రభుత్వ దవాఖానలు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తాండూరు జిల్లా దవాఖాన, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్‌లను బహూకరించారు.

మారుమూల పల్లెలు, తండాల్లోని గర్భిణులు, బాలింతలకు ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ వాహనాలు ఉత్తమ సేవలను అందిస్తున్నాయి. ఆపత్కాలంలో సరైన సమయానికి ప్రభుత్వ దవాఖానలకు తీసుకెళ్తూ పలువురి మన్ననలు పొందుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు, ఇతర అనారోగ్య సమస్యలు, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాధితులను సత్వరమే దవాఖానలకు చేర్చి ప్రాణాలను కాపాడుతుండడంతో వాహనాలు అందించిన దాతలతో పాటు వాహన సిబ్బందికి ప్రజల దీవెనలు అందుతున్నాయి.

- Advertisement -

వికారాబాద్‌ జిల్లాకు ఐదు వాహనాలు..
మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన పిలుపు మేరకు గతేడాది ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’లో భాగంగా టీఆర్‌ఎస్‌ ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు సొంత నిధులతో ఐదు అంబులెన్స్‌లను కొనుగోలు చేసి సర్కారు దవాఖానలకు అందజేశారు. దీంతో వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్‌ నియోజకవర్గాల్లో ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ వాహనాల సేవలు అందుతున్నాయి. అంబులెన్స్‌లను అందజేసి సరిగ్గా ఏడాది కాలం పూర్తి కావస్తున్నది. ఈ నేపథ్యంలో జిల్లా మంత్రి సబితారెడ్డితో పాటు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు ప్రత్యేక నిధులను అందజేశారు. చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి వికారాబాద్‌, పరిగి, తాండూరు ప్రభుత్వ దవాఖానలకు అంబులెన్స్‌లను అందజేయగా, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తాండూరు దవాఖానకు, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పరిగి ప్రభుత్వ దవాఖానకు వాహనాన్ని అందించారు.

కరోనా సమయంలో..
కరోనా సమయంలో ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ వాహనాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. లాక్‌ డౌన్‌ సమయంలో సుమారు 10వేల మందికి పైగా సేవలందాయి. గర్భిణులు, బాలింతలకు ఏ ఆరోగ్య సమస్య తలెత్తినా ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ వాహనాల్లో తీసుకెళ్లారు. వాహనాల కోసం రూ.కోటికి పైగా ఖర్చు చేశారు.

‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ అంబులెన్స్‌లు ఇలా..
రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు అందించిన ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ వాహనాలు పేదల పాలిట సంజీవనిలా మారాయి. ఆపద సమయంలో బాధితులను సర్కారు దవాఖానలకు చేర్చుతూ పేదల ప్రాణాలను కాపాడుతున్నాయి. మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు ప్రజాప్రతినిధులు సొంత నిధులతో అత్యాధునిక పరికరాలతో కూడిన అంబులెన్స్‌లను కొనుగోలు చేసి ప్రభుత్వ దవాఖానలకు అందించారు. 24 గంటలు సేవలను అందిస్తూ ప్రజల మెప్పును పొందుతున్నారు. ఇందులో పైలెట్‌, టెక్నీషియన్‌ ఉంటారు. ఫోన్‌ వచ్చిందంటే వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దవాఖానకు తరలిస్తారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టినందుకు ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

పేదలకు అండగా ‘స్మైల్‌’
రంగారెడ్డి, జూలై 17, (నమస్తే తెలంగాణ) : ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కింద అందజేసిన అంబులెన్స్‌లు పేదలకు అండగా నిలుస్తున్నాయి. అత్యవసర సమయాల్లో బాధితులను దవాఖానలకు చేర్చుతూ గతేడాది కాలంగా సేవలందిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన పిలుపు మేరకు ప్రజాప్రతినిధులు అంబులెన్స్‌లను ఆయా నియోజకవర్గాలకు అందజేసిన సంగతి తెలిసిందే. జిల్లాలో విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గానికి అంబులెన్స్‌ను అందజేయగా, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌ రెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌, చేవెళ్ల నియోజకవర్గాలకు ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కింద అంబులెన్స్‌లను అందజేశారు. ఏడాది కాలంగా అత్యవసర సమయాల్లో బాధితులను దవాఖానలకు చేర్చి ప్రాణాపాయం నుంచి కాపాడుతున్నారు. జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో గతేడాది 838 మందికి, చేవెళ్ల నియోజకవర్గంలో 625 మందికి, రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో 817 మంది బాధితులకు ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ సేవలు అందాయి. వాహన సేవలు పొందిన మహేశ్వరం, రాజేంద్రనగర్‌, చేవెళ్ల నియోజకవర్గాల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

చాల సంతోషంగా ఉన్నది..
‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ అంబులెన్స్‌ పైలెట్‌గా సేవలందించడం చాలా సంతోషంగా ఉన్నది. వాహనాల్లో ఆక్సిజన్‌, వెంటిలేటర్‌తో సహా అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడి క్లిష్ట పరిస్థితిలో ఉన్నవారిని సమయానికి తీసుకెళ్లి ప్రాణాలను కాపాడటం మనస్సుకు ఎంతో సంతోషం కలిగించింది. అంబులెన్స్‌లు అందజేసిన వారికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

  • దస్తప్ప, 108 ఫైలెట్‌

అంబులెన్స్‌ సేవలు భేష్‌..
‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ అంబులెన్స్‌ సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గర్భిణులు, బాలింతలు, రోడ్డు ప్రమాద బాధితులను దవాఖానలకు చేర్చడం అభినందనీయం. ఆపత్కాలంలో పేదలను ఆదుకోవడం ఎంతో సంతోషకరం. ప్రజాశ్రేయస్సు కోసం శ్రద్ధ తీసుకుంటున్న ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు.

  • డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

వేగిరంగా ఘటనా స్థలానికి..
ఫోన్‌ వచ్చిందంటే చాలు.. వేగిరంగా ఘటనా స్థలానికి చేరుకుంటాం. ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అందజేసిన ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ 108 అంబులెన్స్‌తో పరిగి, బొంరాస్‌పేట మండలాల పరిధిలో సేవలందిస్తున్నాం. అవసరమైతే ఇతర మండలాలకూ వెళ్తున్నాం. సేవలు పొందిన బాధితులు వాహనాలు అందించిన ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

  • శేఖర్‌గౌడ్‌, 108 ఆంబులెన్స్‌ పైలెట్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పుట్టిన రోజున బహుమతై..ఆపదలో బందువై..
పుట్టిన రోజున బహుమతై..ఆపదలో బందువై..
పుట్టిన రోజున బహుమతై..ఆపదలో బందువై..

ట్రెండింగ్‌

Advertisement