ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
నందిగామ, అక్టోబర్ 6 : ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, ఎంపీపీ ప్రియాంకగౌడ్తో కలిసి మహిళలకు బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్, చేగూరు పీఏసీఎస్ చైర్మన్ అశోక్, మాజీ చైర్మన్ విఠల్, ఎంపీటీసీ చంద్రపాల్‌రెడ్డి, ఉపసర్పంచ్ కుమార్‌గౌడ్, నాయకులు లింగంగౌడ్, పెంటయ్యగౌడ్, కృష్ణయ్య, రాములు, శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహ, రవీందర్, ఆశీర్వాదం పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ
నందిగామ గ్రామానికి చెందిన ఎండీ అనిశ్ బేగానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.44 వేలు చెక్కును లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అందజేశారు.
ఉద్యమకారుడికి ఎమ్మెల్యే పరామర్శ
కొత్తూరు, అక్టోబర్ 6 : అనారోగ్యంతో బాధపడుతున్న మలిదశ తెలంగాణ ఉద్యమకారుడిని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పరామర్శించారు. కొత్తూరులో నివాసముంటున్న బొమ్ముకృష్ణస్వామి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బుధవారం స్వామి ఇంటికి వెళ్లి పరామర్శించి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేతో మున్సిపల్ వైస్ చైర్మన్ రవీందర్, కౌన్సిలర్ కొస్గి శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు దేవేందర్ యాదవ్, సిటీకేబుల్ వెంకటేశ్ ఉన్నారు.