పరిగి, అక్టోబర్ 6 : పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని పరిగి ఎమ్మె ల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పరిగి నియోజకవర్గంలోని పరిగి, దోమ, కులకచర్ల, పూడూరు, గండీడ్ మండలాలకు చెందిన 28 మందికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.19.95లక్షలకు సంబంధించిన చెక్కులు ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సర్కారు తోడ్పాటు అందిస్తున్న ద న్నారు. కార్పొరేట్ దవాఖానల్లో చికిత్సలు పొందిన వారికి సర్కారు సీఎం ఆర్ఎఫ్ కింద సహాయం అందిస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కె. అరవిందరావు, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, సీనియర్ నాయకులు కొప్పుల అనిల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు మేడిద రాజేందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకులు బి.ప్రవీణ్ కుమార్ రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, నార్మాక్స్ డైరెక్టర్ పి.వెంకట్ రాం రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జగదీశ్వర్, బి.రవికుమార్ పాల్గొన్నారు.
వికారాబాద్, అక్టోబర్ 6 : నిరుపేద ప్రజలకు సీఎం సహాయనిధి ఎంతో అండగా నిలుస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. బుధవారం వికారాబాద్ నియోజకవర్గంలోని ధారూరు మండ లం లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్య క్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, సర్పంచ్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.