యాచారం, జనవరి 31: బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఎం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన విద్రోహదినంలో భాగంగా సోమవారం నిరసన చేపట్టారు. మండల కేంద్రంలో సాగర్ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు అంజయ్య, సీఐటీయూ నాయకుడు బ్రహ్మయ్య మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ సర్కారును గద్దే దించే వరకు పోరాడుతామన్నారు. విపరీతంగా ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు శ్రీమన్నారాయణ, భాషయ్య, మల్లేశ్, పాండు, అరుణ తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను తీవ్ర నష్టాలకు గురిచేస్తున్నదని సీఐటీయూ నాయకులు ఎల్లేశ్ అన్నారు. జనవరి 31న విద్రోహ దినాన్ని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, ప్రజలే త్వరలో సరైన బుద్ధి చెప్తారన్నారు. కార్యక్రమంలో వెంకటేశ్, జంగయ్య, బుగ్గరాములు, యాదగిరి, స్వప్న, యాదయ్య, వీరేషం, చరణ్, శ్రీకాంత్ ఉన్నారు.
తలకొండపల్లి : రైతుల పట్ల కేంద్రం తీరుకు నిరసనగా విద్రోహదినంగా పాటించినట్లు నాయకులు తెలిపారు. మండల కేంద్రంలో రైతుసంఘం, సీఐటీయూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో కురుమయ్య, చెన్నయ్య, పోచయ్య, పర్వతాలు, యాదయ్య, జంగమ్మ, యాదమ్మ, శాంతమ్మ పాల్గొన్నారు