తాండూరు, నవంబర్ 7: వ్యవసా య రంగంలో ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లను ప్రోత్సహించేందుకు.. సాగుకు సాంకేతిక దన్నుగా నిలిచేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ కేంద్రంగా పనిచేయనున్న హబ్ సేవలను రైతులకు చేరువ చేసేందుకు వికారాబాద్, వరంగల్, జగిత్యాలలో ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే తాండూరు వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో రూ.1.58 కోట్లతో అగ్రి హబ్ ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వ సూచనలతో టీహబ్‌ను ఆదర్శంగా తీసుకొని పలు స్టార్టప్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని అగ్రి హబ్‌కు వ్యవసాయ వర్సిటీ రూపకల్పన చేసింది. సాగుకు సాంకేతిక తోడ్పాటునందించేందుకు యూనివర్సిటీ 11 నుంచి 21 స్టార్టప్‌లకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్, మిషన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతికను వ్యవసాయ రంగంలో ఈ స్టార్టప్‌ల సాయంతో వినియోగించనున్నారు. డ్రోన్ల ద్వారా మందుల పిచికారీ, రోబోటిక్ విధానంలో కలుపుతీయడం, తెగుళ్లను గుర్తించడం వంటి సమాచారంతోపాటు గ్రామీ ణ యువత, మహిళలు, రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అగ్రి బిజినెస్ మెళకువలు నేర్చుకునేందుకు గ్రంథాలయంగా ఉపయోగపడుతుందని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
నాబార్డు సహకారంతో..
నాబార్డు ఆర్థిక అండతో తాండూరు వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో రూ.1.58 కోట్లతో అగ్రి హబ్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆరు నెలల్లో ఈ పనులు పూర్తవుతాయని.. అప్పటివరకు రైతులకు అగ్రి హబ్‌పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తాండూరు కేంద్రం అగ్రి హబ్ ఇన్చార్జి దుర్గ తెలిపారు. గ్రామీ ణ యువత, మహిళలు, రైతులకు అగ్రి బిజినెస్ మెళకువలపై రెండు రోజుల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించా రు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం చేయడం, అధిక దిగుబడుల సాధనకు శిక్షణ ఇవ్వడంతోపాటు వివిధ రకాల విత్తనాల(వంగడాలు)పై అవగాహన కల్పించనున్న ట్లు తెలిపారు. తాండూరులో నాణ్యమైన కుసుమ నూనె, కందిపప్పును తయారు చేసి ఇతర ప్రాంతాల్లో విక్రయించడం ద్వారా మంచి పేరు వచ్చిందని.. అంతేకాకుండా తాండూ రు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో అధిక దిగుబడులిచ్చే నూతన వంగడాలను తయారు చేయడంతో తాండూరు లో అగ్రిహబ్ ఏర్పాటుకు మార్గం సుగమమైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో తాండూరుతోపాటు జిల్లా రైతులకు మరిం త మేలు జరుగనున్నది.
గ్రంథాలయంగా అగ్రిహబ్
గ్రామీణ యువత, మహిళలు, రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులు అగ్రిబిజినెస్ మెళకువళలను నేర్చుకునేందుకు అగ్రిహబ్ ఓ గ్రంథాలయంగా ఉపయోగపడుతుంది. నూత న టెక్నాలజీతో నాణ్యత గల విత్తనాలు, మొక్కలకు కావాల్సిన ఎరువులు, పురుగు మందు లు, పంట దిగుబడి తదితర వివరాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అగ్రిహబ్‌ను అనుసరించిన రైతులకు పెట్టుబడులు తగ్గి పంటలో నాణ్యత పెరుగడం తోపాటు దిగుబడి కూడా పెరుగుతుంది. తాండూరులో అగ్రిహబ్ ఏర్పా టు చేయడం జిల్లాకు వరం లాంటిది.
-డాక్టర్ సుధారాణి, ప్రధాన శాస్త్రవేత్త,తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం