మిరుదొడ్డి, జూలై 2 : రైతుల ఆర్థికాభివృద్ధికి సహకార సంఘం బ్యాంకు ఎంతో దోహదపడుతుందని పీఏసీఎస్ వైస్ చైర్మన్ లింగాల రాజలింగారెడ్డి అన్నారు. మిరుదొడ్డి వ్యవసాయ పరపతి సహకార సంఘం వంద వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం మిరుదొడ్డిలోని సహకారం సంఘం కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్లు నర్సింహులు, రవి, నాగులు, కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ములుగు, జూలై 2 : మండల కేంద్రం ములుగులోని పీఏసీఎస్ కార్యాలయంలో అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార సంఘం జెండాను పీఏసీఎస్ చైర్మన్ అంజిరెడ్డి ఎగురవేశారు. అనంతరం పీఏసీఎస్ సిబ్బంది భిక్షపతిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ నరేశ్‌గౌడ్, సీఈవో రమేశ్‌బాబు, డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
జగదేవ్‌పూర్, జూలై 2: సహకార సంఘం ద్వారా రైతులకు రుణాలు, ఎరువులు రాయితీపై అందజేస్తున్నామని పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. శనివారం అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో జెండావిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఏసీఎస్ ద్వారా ఎంతో మంది రైతులు, చిరువ్యాపారులకు రుణాలు అందజేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే మండల వ్యాప్తంగా రైతులకు కోట్లాది రూపాయల రుణాలు అందజేశామన్నారు. కార్యక్రమంలో కో-ఆపరేటివ్ బ్యాంకు మేనేజర్ నాగభూష ణం, డైరెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గజ్వేల్, జూలై 2 : సహకార సంఘాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశంగౌడ్ అన్నారు. 100వ అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా గజ్వేల్ పీఏసీఎస్ ఎదుట జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా రైతులు, మహిళలకు రుణా లు అందిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ సీఈవో బాలయ్య, సిబ్బంది పాల్గొన్నారు.