నందిగామ, మే 31: మండలంలోని చేగూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బృహ త్ పల్లె ప్రకృతివనాన్ని మంగళవారం కేంద్ర పంచాయతీరాజ్ కార్యదర్శి సునీల్‌కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలతో గ్రామా లు పచ్చదనం, పరిశుభ్రంగా మారుతున్నాయన్నారు. హరితహారంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించా రు. పల్లెప్రకృతివనాలు, బృహత్ పల్లెప్రకృతి వనాల ఏర్పాటుతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. తడి, పొడి చెత్త సేకరణతో గ్రామాలు శుభ్రంగా మారుతున్నాయ న్నారు. గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పా టు మంచి నిర్ణయమని పేర్కొన్నారు.
కేంద్ర పంచాయతీరాజ్ కార్యదర్శి వెంట రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కమిషనర్ శరత్, ఎస్బీఎం డైరెక్టర్ సురేశ్‌బాబు, కలెక్టర్ అమయ్‌కుమార్, అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, పంచాయతీరాజ్ స్పెషల్ కమిషనర్ ప్రసాద్, డిప్యూటీ కమిషనర్లు రవీందర్, రామారా వు, జాయింట్ కమిషనర్ వెస్లీ, డీపీవో శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ సీఈవో దిలీప్‌కుమార్, డీఆర్డీవో ప్రభాకర్, ఆర్డీవో వేణుమాధవ్రా వు, డీఎల్పీవో శ్రీకాంత్‌రెడ్డి, ఏపీడీలు నీర జ, గౌతమ్, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, నందిగామ ఎంపీపీ ప్రియాంకాగౌడ్, చేగూ రు సర్పంచ్ సంతోష, ఎంపీడీవో బాల్‌రెడ్డి, ఎంపీవో గిరిరాజ్, ఎంపీఎం యాదగిరి , స్థానికులు ఉన్నారు.