చేవెళ్లటౌన్, నవంబర్ 1 : ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. గ్రామాల అభివృద్ధికి సర్కార్ అధిక నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నది. తద్వారా గ్రామాలు పట్టణాలకు దీటుగా అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. అందుకు నిదర్శనం బస్తేపూర్ గ్రామం.
ఏండ్ల నాటి సమస్యలకు పరిష్కారం..
పల్లె ప్రగతితో గతంలో పేరుకుపోయిన సమస్యలు పూర్తిగా తొలగిపోయాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధతో గ్రామంలో సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు.
పల్లె ప్రగతి పనులు పూర్తి..
వైకుంఠధామం, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. పారిశుధ్య పనులు, మొక్కల సంరక్షణ, చెత్తను డంపింగ్ యార్డుకు తరలించి తడి, పొడి చెత్తను వేరు చేసి ఎరువులను తయారు చేస్తున్నారు.
సమస్యలు పరిష్కారం
పల్లె ప్రగతి పనులతో గతంలోని సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాయి. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా శ్రద్ధ వహించి అధిక నిధులు మంజూరు చేయడంతోనే అభివృద్ధి సాధ్యమవుతున్నది. నేడు ప్రజలకు సకల సౌకర్యాలు కల్పించి వారి వెతలు తీర్చుతున్నాం.
స్వచ్ఛ గ్రామంగా మార్చుతున్నాం..
గ్రామస్తుల సహకారంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమైంది. పల్లె ప్రగతి పనులతో ఏండ్ల నాటి నుంచి పేరుకుపోయిన సమస్యలకు పరిష్కారం దొరికింది. పారిశుధ్య నిర్వహణ, చెత్త సేకరణకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ గ్రామాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చుతున్నాం.