పరిగి, జూలై 10 : జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. జిల్లాలోని పలు ప్రాంతాలలో మో స్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. శనివారం పగలు చిరుజల్లులు కురియగా రాత్రి సమయంలో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని వాగులు, వంకలు వరద నీటితో ప్రవ హించాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చి చేరాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో జన జీవనంపై తీవ్ర ప్రభావం పడింది. ఏ పని ఉన్నా బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మరో రెండుమూ డు రోజులు ఉపరితల ఆవర్తన ద్రోణి, రుతుపవనాల వల్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో జిల్లా యంత్రాంగం సైతం అప్రమత్తమైంది. వర్షాలతో జిల్లా పరిధిలో 21 ఇండ్లు కూలిపోయాయి.
ఎలాంటి నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. వికారాబాద్‌లో 7.7 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. మర్పల్లిలో 51.3 మి.మీ., మోమిన్‌పేట్‌లో 45.6 మి.మీ., నవాబుపేట్‌లో 40.5 మి.మీ., పూడూరులో 69.3 మి.మీ., పరిగిలో 53.5 మి.మీ., కులకచర్లలో 35.9 మి.మీ., దోమలో 34.6 మి.మీ., బొంరాస్‌పేట్‌లో 31.2 మి.మీ., ధారూర్‌లో 41.8 మి.మీ., కోట్‌పల్లిలో 37 మి.మీ., బంట్వారంలో 33 మి.మీ., పెద్దేముల్లో 41 మి.మీ., తాండూరులో 44.4 మి.మీ., బషీరాబాద్‌లో 38.7 మి.మీ., యాలాల్లో 30.5 మి.మీ., కొడంగల్‌లో 36.7 మి.మీ.,దౌల్తాబాద్‌లో 40.4, చౌడాపూర్‌లో 20.5 మి.మీ.ల వర్షపాతం నమోదైంది.
తాండూరు నియోజకవర్గంలో..
తాండూరు, జూలై 10: వారం రోజులుగా ఎడతెగని వర్షం కురవడంతో తాండూరు నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండి జలకళను సంతరించుకున్నా యి. భారీగా కురుస్తున్న వర్షాలతో ఇరిగేషన్ శాఖ ఆధీనంలోని 252 చెరువులు, కుంటల్లో నీరు నిండుగా చేరింది. ఆదివారం తాండూరు కాగ్నానది, యాలాల పరిధిలోని కాకరవేణి నదితో పాటు జుంటుపల్లి, శివసాగర్ ప్రాజెక్టులు నిండి అలుగు పారుతున్నాయి.
కూలిన అనంతగిరి వ్యూ పాయింట్
వికారాబాద్, జూలై 10: రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వికారా బాద్ సమీపంలోని అనంతగిరి వ్యూ పాయింట్ కూలిపోయింది. నిజాం న వా బులు అనంతగిరి గుట్టపై వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు. శతాబ్దాలుగా పర్యాట కులకు అద్భు త కట్టడంగా నిలిచింది. ప్రస్తుతం అనంతగిరి అందాలను తిలకిం చాలంటే పర్యా టకులకు గుర్తు వచ్చేది వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్‌ను చూసేందుకు పర్యాట కులు అధిక సంఖ్య లో వచ్చేవారు. ఇక్కడి నుంచి చూస్తే ప్రకృ తి అందాలు కనిపిస్తాయి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పరిగి టౌన్, జూలై 10 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శిథిలావస్థకు చేరిన ఇండ్లల్లో ఉండకుండా జాగ్రత్తలు వహించాలని మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్‌కుమార్ ప్రజలకు సూచించారు. ఆదివారం ఆయన 9వ వార్డులో పర్యటించారు. కార్యక్రమంలో ఎస్సై విఠల్‌రెడ్డి, రియాజ్ పాల్గొన్నారు.