పరిగి, ఫిబ్రవరి 17: సీఎం కేసీఆర్ గొప్ప విజన్ గల నాయకుడని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పరిగిలోని లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ఆధ్వ ర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదానం చేసిన వారికి ఎమ్మెల్యే సర్టి ఫికెట్లు అందజేశారు. అనంతరం ఆలయం ఆవరణలో ఎమ్మెల్యే మొక్క నాటి నీరు పోశారు. పరిగిలోని సర్కారు దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాధించిన నాయకుడిగా సీఎం కేసీఆర్ 8 ఏండ్ల పాలనలో రాష్ర్టాన్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దారని తెలిపారు. వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ర్టాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశారన్నారు.
సకల జనుల సంక్షేమమే ధ్యే యంగా, అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. రైతును రాజుగా చేయడంతోపాటు వ్యవసాయాన్ని పండుగలా మార్చారని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న అనేక పథకాలు దేశంలోని అనేక రాష్ర్టాలకు, కేంద్రానికి ఆదర్శంగా నిలిచి, వాటిని ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని ఎమ్మెల్యే గుర్తు చేశారు. నేడు దేశానికి తెలంగాణ మోడల్ అవసరమని, తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధిలోకి తీసుకువచ్చిన సీఎం కేసీఆర్‌ను దేశ ప్రజలందరూ తమ నాయకుడిగా ఆహ్వానిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ జాతీయ నాయకుడిగా సైతం రాణించి తెలంగాణ వలె దేశంలోని వనరులు సద్వినియోగం చేసుకొని దేశాన్ని ముందుకు తీసుకువెళ్లగలరని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీపీ కరణం అరవిందరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, మాదారం సర్పంచ్ రాములు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తాండూరు నియోజకవర్గంలో..
తాండూరు, ఫిబ్రవరి 17: తెలంగాణ రాష్ట్ర ప్రదాత, బంగారు తెలంగాణ విధాత, బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు శుక్రవారం తాండూరు నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో గులాబీ పార్టీ శ్రేణులు కేక్‌లను కట్‌చేసి సేవా కార్యక్రమాలు చేశారు. దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో నేతలు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సూచనల మేరకు పట్టణ శాఖ అధ్యక్షుడు నయీం, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీపనర్సింహులు ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం నిర్వహించారు. బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ అభిమానులు రక్తదానం చేశారు. రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యం లో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, బీఆర్ఎస్ నేతలు కేక్ కట్‌చేసి సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో చిరకాలం జీవించాలని ఆకాంక్షించారు.
బీఆర్ఎస్తో దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన పోటీ ల్లో గెలుపొందిన విద్యార్థులకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజూగౌడ్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. దేశంలో కూడా కేసీఆర్ పాలన రావాలంటే ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్కు మద్ధతు పలుకాలని కోరారు. విద్యార్థులు ఉద్యమ చరిత్రను , కేసీఆర్ శ్రమను మరవరాదని సూచించారు. కార్యక్రమంలో మండల, పట్టణ శాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ప్రత్యేక రాష్ట్రంలో ఆత్మగౌరవంగా..
కొడంగల్, ఫిబ్రవరి 17: తెలంగాణ ప్రజల బతుకులు మార్చి, తెలంగాణను చరిత్రపుటల్లో నిలబెట్టిన సీఎం కేసీఆర్ సల్లంగ ఉండాలని ప్రజలు సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా దేవుండ్లకు ప్రత్యేక పూజలు నిర్వహి స్తున్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నియోజకర్గ పరిధిలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల బీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కేక్ కట్కేసి సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా నియోజకవర్గ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలబెట్టినట్లు తెలి పారు. ప్రత్యేక రాష్ట్రంలో అన్ని వర్గాల వారి ఆత్మగౌరవం పెరిగిందన్నారు. మళ్లీ కేసీఆరే సీఎం కావాలని తెలంగాణ ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారన్నారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొం రాస్‌పేట, దౌల్తాబాద్, కోస్గి, మద్దూర్ మండలాల పరిధిలో మొత్తం 51 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.