దోమ,అక్టోబర్ 30: దోమ మండల పరిధిలోని గొడుగోనిపల్లి పల్లె ప్రగతితో అభివృద్ధ్ది దిశగా అడుగులు వేస్తున్నది. గ్రామానికో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. రకరకాల మొక్కలను పెంచి నందవనంలా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేశారు. అక్కడక్కడ బేం చీలు సమకూర్చారు. పల్లె ప్రగతి ప్రారంభం నుంచి ఇప్పటివరకు రూ. 25 లక్షల వ్యయంతో ప్రతి గల్లీలోనూ సీసీ రోడ్లు వేసి పరిశుభ్రతకు పెద్దపీట వేశారు. రూ.12 లక్షల ఖర్చుతో వైకుంఠధామం నిర్మాణం పూర్తి చేసి అందబాటులోకి తీసుకొచ్చారు. గ్రామ పం చాయతీకి చెత్త సేకరణ నిమిత్తం రూ. 12 లక్షలు వెచ్చించి ట్రాక్టర్ కొనుగోలు చేశారు. మొక్కల పెంప కానికి తోడ్పడేందుకు వాటర్ ట్యాంకర్ను కొనుగోలు చేశారు. గతంలో గ్రామం చుట్టూ రోడ్లకు ఇరువైపులా చెత్తా చెదారం కనిపించేది. నేడు రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లు దర్శనమిస్తున్నాయి. రూ.2.5 లక్షల వ్యయంతో కంపోస్టు షెడ్డును నిర్మించి తడి పొడి చెత్తతో కంపోస్టు ఎరువులను తయారు చేసేందుకు కృషి చేస్తున్నారు. మిషన్ భగీరథ తాగు నీరు ఇంటింటికీ సరఫరా అవుతున్నది. జనాభా ప్రాతిపదికన ప్రతి నెలా సమయానికి నిధులు అందుతున్నాయి.
గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నాం..
ప్రభుత్వ ఆదేశాల మేరకు పల్లె ప్రగతిలో పలు అభివృద్ధి పనులు చేపట్టి అందుబాటు లోకి తీసుకొచ్చాం. పంచా యతీకి ప్రభుత్వం ద్వారా అందిన ప్రతి రూపాయినీ సద్వి ని యోగం చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి దిశలో నడిపించేం దుకు నిర్విరామంగా కృషి చేస్తాను. ప్రజల భాగస్వామ్యంతో కలిసికట్టుగా పని చేస్తాం – అమృతమ్మ సర్పంచ్
ప్రత్యేక చొరవతో అభివృద్ధి
ఆయా గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శుల ప్రత్యేక చొరవతో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేశాం. ప్రజ లకు అన్ని సౌకర్యాలు సమకూరే విధంగా కార్యా చరణ కొనసా గుతున్నది. పల్లె ప్రగతిలో గొడుగోనిపల్లి గ్రామానికి అన్ని రకాల వసతులు కల్పించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీర్చిదిద్దాం
– జయరాం,మండల అభివృద్ధి అధికారి