కొందుర్గు, అక్టోబర్ 1 : టీఆర్ఎస్ ప్రభుత్వం కుల వృత్తులకు ప్రాధాన్యత ఇస్తున్నదని ఎంపీపీ జంగయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని చెరువుల్లో వేయడానికి 3లక్షల చేపపిల్లలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వం సరఫరా చేస్తున్న చేప పిల్లలు బాగా పెరుగుతున్నాయన్నారు. దీని ద్వారా మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఆంజనేయులు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్ నర్సింహారెడ్డి, నాయకులు రామకృష్ణ, మాణెయ్య. జాహింగీర్ పాల్గొన్నారు.
మత్స్యకారుల అభ్యన్నతికి పెద్దపీట
మత్స్యకారుల అభ్యున్నతికి సర్కార్ పెద్దపీట వేస్తున్నదని ఫరూఖ్‌నగర్ మండలం కొండన్నగూడ సర్పంచ్ శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ఉచితంగా అందజేసిన చేపపిల్లలను శుక్రవారం గ్రామంలోని చెరువులో వదిలిన సందర్భంగా మాట్లాడారు. మత్స్యరంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కార్ ముందుకు సాగుతుందన్నారు. మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు చెరువుల్లో ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆంజనేయులుగౌడ్, వార్డు సభ్యుడు చంద్రారెడ్డి, నాయకులు కృష్ణయ్య, యాదగిరి, సత్తయ్య, నర్సింహులు, యాదయ్య, పాల్గొన్నారు.