ఆదివారం 24 జనవరి 2021
Rajanna-siricilla - Dec 03, 2020 , 01:43:01

అర్హులకు సంక్షేమ ఫలాలు అందించాలి

అర్హులకు సంక్షేమ ఫలాలు అందించాలి

  • గ్రామాల సమగ్రాభివృద్ధిపై దృష్టి సారించాలి
  • మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌

బోయినపల్లి: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను అర్హులకు చేరవేయాలని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌  అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు.  మండల పరిషత్‌ సర్వసభ్య స మావేశం బుధవారం ఎంపీపీ అధ్యక్షతన జరిగింది. జడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య, అధికారులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా   ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టిన డంప్‌ యార్డులు, శ్మశాన వాటికలు, కంపోస్టు షెడ్లు, పల్లె ప్రకృతి వనాల పనులు సత్వరమే పూర్తి చేయాలని కోరారు.  రైతు వేదికల పనులను పూర్తి చేసిన ప్రజా ప్రతినిధులను అభినందించారు.  ప్రభుత్వం అన్నదాతల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నదని చెప్పారు. చలికాలం కొవిడ్‌ వ్యాపించే ప్రమాదం ఉన్నందునా ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యాధికారులకు సూచించారు.  ప్రభుత్వం చేపట్టిన ఆన్‌లైన్‌ తరగతులకు విద్యార్థులు హాజరుకావడం లేదని, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులతో ప్ర త్యేక సమావేశం నిర్వహించాలని మండల విద్యాధికారికి  సూచించారు.  ప్రభుత్వం రైతులకు సబ్బిడీ విత్తనాలు అందిస్తున్నదని చెప్పారు.  ఈ విషయం లో ఏఈవోలతో సమావేశం నిర్వహించాలని ఏవో ను కోరారు.  మిషన్‌ భగీరథ, వి ద్యుత్‌ సమస్యలు ఉంటే ఏఈలు తన దృష్టికి తీసుకురావాలని కో రా రు. అన్ని శాఖల అధికారులు గ్రా మాల సమగ్రాభివృద్ధిపై దృష్టి సారించాలని విన్నవించారు. జడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య మాట్లాడుతూ ప్రభు త్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని చెప్పారు. అధికారులు కూడా చిత్తశుద్ధితో ప ని చే యాలని కోరారు. సమావేశంలో ఎంపీడీవో నల్ల రా జేందర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ కొనుకటి నాగయ్య, ఆర్‌ఐ విద్యాసాగర్‌రెడ్డి, ఎంపీవో గంగాతిలక్‌, ఏపీవో శ్రీనివాస్‌, ఏపీఎం నర్సయ్య, విద్యాధికారి శ్రీనివాస్‌, వైద్యులు శ్రీఖర్‌, సౌమ్య, ఎంపీటీసీలు డబ్బు మమ త, సంబ బుచ్చమ్మ,అక్కెనపల్లి ఉపేందర్‌, కొంకటి శిరీష, ఈడ్గు రాజేశ్వరి, ఉయ్యాల శ్రీ ని వాస్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు ఎండీ అజ్జు, సర్పంచు లు గుంటి లతశ్రీ, గుడ్ల సుకన్య, బూర్గుల నందయ్య, చిందం రమేశ్‌, ఇల్లందు శంకర్‌, శ్రీనివాస్‌ ఉన్నారు.


logo